BJP Plans To Snatch Womens Votes In Uttar Pradesh :
భారతీయ జనత పార్టీ రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రణాలికలు సిద్దం చేస్తోంది. ఇందుకోసం మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలను కమలనాథులు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో యోగి అధిత్యనాథ్ ప్రభుత్వం తిరిగి గద్దె ఎక్కేందుకు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని బిజెపి ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇటీవల ఉత్తరప్రదేశ్ లో మహిళల రక్షణ కరువైందని తరచుగా ఆరోపణలు చేయటం, నారీ సురక్ష కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందని ప్రసంగాలు చేయటం కొంత ప్రజలపై ప్రభావం పడుతోందని బిజెపి అనుమానిస్తోంది.
యోగి ప్రభుత్వం ఏలుబడిలో ఉత్తరప్రదేశ్ లో మహిళల భద్రత, మహిళా సాధికారత, మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చట్టాలు, గుండాగిరి, మాఫియా దురాగతాలను కట్టడి చేసిన విధానాల్ని ప్రజలకు వివరించేందుకు కార్యక్రమాల రూపకల్పన చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు వేలమంది మహిళ లబ్దిదారులను ఎంపిక చేసి వారితో ప్రభుత్వం నారీలోకం కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి సమావేశాల్లో మాట్లాదిస్తారు. బిజెపి ప్రభుత్వం 2017 సంవత్సరంలో అధికారంలోకి వచ్చాక మహిళల కోసం చేసిన పనులపై రెండు వేల మంది మహిళలతో “కమల్ శక్తి సంవాద్” పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఝాన్సీ, మొరదాబాద్, కాన్పూర్, ఆగ్రా, మీరట్, ప్రయగ్ రాజ్, షాజహాన్ పూర్, గోరఖ్ పూర్, లక్నో లలో ఈ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ నెల 14వ తేదిన ఝాన్సీ లో ప్రారంభమై ఈ నెల 27 వ తేది వరకు జరుగుతాయి. వీటిల్లో బిజెపి ప్రభుత్వాల్లోని కేంద్ర, రాష్ట్ర మహిళా మంత్రులు పాల్గొంటారు.
Also Read : ఉత్తరప్రదేశ్లో 40 శాతం టికెట్లు మహిళలకే – కాంగ్రెస్