Wednesday, October 4, 2023
HomeTrending NewsNirudyoga March: మిలియన్ మార్చ్ తరహాలో నిరుద్యోగ మార్చ్

Nirudyoga March: మిలియన్ మార్చ్ తరహాలో నిరుద్యోగ మార్చ్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దోషుల అంతు చూసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అందులో భాగంగా మిలియన్ మార్చ్ తరహాలో త్వరలోనే నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని, ఈ విషయంపై పార్టీ నేతలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. పేపర్ లీకేజీ కారకుడైన కేసీఆర్ కొడుకు రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేవరకు పోరాడతామన్నారు. నిరుద్యోగులెవరూ నిరాశపడొద్దని బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యూపీఎస్పీ తరహాలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకల అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

• సిట్ నోటీసులు నాకు అందలేదు. అసలు సిట్ విచారణకే మేం వ్యతిరేకం. ఎందుకంటే కేసీఆర్ సిట్ అంటే సిట్. స్టాండ్ స్టాండ్. నయీం డైరీ, మియాపూర్ భూములు, డ్రగ్స్, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య సహా పలు కేసులపై విచారణ చేసిన సిట్ నివేదికలు ఏమైనయ్…

• అసలు నోటీసులు ఇవ్వాల్సి వస్తే తొలుత కేసీఆర్ కొడుకుకే నోటీసులు ఇవ్వాలి. ఆయనకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు? ప్రతిపక్షాలుగా మాకు ప్రజల నుండి వచ్చే సమాచారాన్ని ద్రుష్టిలో ఉంచుకుని మాట్లాడతాం.. నోటీసుల పేరుతో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు.

• నిర్మల్ లో విపరీతమైన భూ కబ్జాలకు పాల్పడుతూ, సఫాయి కార్మికుల నుండి పైసలు తీసుకునే ఓ మంత్రి పేపర్ లీకేజీ సర్వసాధారణమంటున్నాడు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టేలా లీకేజీ చేస్తే సర్వసాధారణమా?

• సీనియర్ జర్నలిస్టుల తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్, సతీష్ కమాల్, సుదర్శన్ గౌడ్ అరెస్ట్ దుర్మార్గం. వాళ్లను ఎందుకు అరెస్ట్ చేశారు. తప్పు చేస్తే కేసు పెట్టాలే తప్ప అర్ధరాత్రి దొంగల్లా వచ్చి ఎత్తుకెళ్లడమేంది? తీన్మార్ మల్లన్న, సుదర్శన్ గౌడ్, విఠల్, సతీష్ కమాల్ వంటి వారిని చూస్తేనే కేసీఆర్ లో వణుకు పుడుతోంది. అందుకే భయపడి అరెస్ట్ చేస్తోంది.

• ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కోర్టును ఆశ్రయిస్తాం… న్యాయపరంగా, చట్టపరంగా పోరాడతాం..

• ప్రభుత్వం పక్షాన పనిచేయాల్సిన తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వోకేట్ జనరల్ కేసీఆర్ బిడ్డను కాపాడటానికి ఢిల్లీకి వెళ్లి ఈడీని ఎట్లా కలుస్తారు? ఆయన కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తున్నారా? ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నాం. బార్ కౌన్సిల్ లో ఫిర్యాదు వేస్తాం. న్యాయపరంగా పోరాడతాం.

• ట్విట్టర్ టిల్లు… దమ్ముంటే ఊళ్లలో తిరిగితే తెలుస్తుంది. ప్రజలు తగిన బుద్ది చెబుతారు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కారకుడు ట్విట్టర్ టిల్లునే.. ఆయన ఎందుకు రాజీనామా చేయడు? కేసీఆర్ ఎందుకు బర్తరఫ్ చేయడు? తెలంగాణ మీ కుటుంబ గుత్తాధిపత్యం అనుకుంటున్నవా?

• తెలంగాణ ఉద్యమకారులారా…. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరినీ వేధిస్తున్నరు. జర్నలిస్టులసహా అందరిపై కేసులు పెడుతున్నరు. ఇంకెన్నాళ్లు ఇంట్లో కూర్చుందాం? మళ్లీ నిజాం పాలన గుర్తుకొస్తుంది. మీరంతా బయటకు రండి… బీజేపీ అండగా ఉంటుంది.

• నిరుద్యోగులారా…. మీరంతా బీజేపీ చేసే పోరాటాలకు మద్దతివ్వండి. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం…

• త్వరలో నిరుద్యోగ యువత కోసం మిలియన్ మార్చ్ తరహాలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఇందుకోసం పార్టీ నేతలందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం…

• సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి నాకు తెల్వదు… నాకు ఇంకా అందలేదు. మేం సిట్ విచారణకు వ్యతిరేకం.. సిట్ విచారణపై మాకు నమ్మకం లేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.

• కేసీఆర్ బిడ్డ ఫోన్లు అన్ని వాడుతుందా? అవి ఫోన్లా? మెడల్సా? ఫోన్ల ధ్వంసంపై ఈడీయే సమాధానమివ్వాలి. దాంతో మాకు సంబంధం లేదు.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Ramaraju on జనం భాష
Ramaraju on జనం భాష
Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న