Saturday, November 23, 2024
HomeTrending Newsఎనిమిదేళ్ళలో కెసిఆర్ సామాన్యులను కలిశారా - ఈటెల రాజేందర్

ఎనిమిదేళ్ళలో కెసిఆర్ సామాన్యులను కలిశారా – ఈటెల రాజేందర్

ఎనిమిదేళ్ల కాలంలో సమస్యలు వస్తే ప్రగతి భవన్, సచివాలయంలో సిఎం కెసిఆర్ ను కలిసే భాగ్యం దక్కిందా ప్రజలు ఆలోచించాలని బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ సామాన్యులను కలిసేందుకు ఏనాడు చొరవ చూపలేదని విమర్శించారు. కేసీఆర్ నీ వెన్ను నీకు కనబడటం లేదు… ప్రజలకు కనబడుతోందని హెచ్చరించారు. యాదగిరిగుట్టలో బిజెపి బహిరంగసభలో పాల్గొన్న ఈటెల రాజేందర్ సిఎం కెసిఆర్, కాంగ్రెస్ లపై విమర్శల వర్షం కురిపించారు. కారులో వస్తున్నప్పుడు ఒక ముఖ్య వ్యక్తి ఫోన్ చేసి బిజెపి వైపు చూస్తున్నట్లు చెప్పారని, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తారని చెప్పితే.. వినాలనే చెబుతున్నానన్నారని ఈటెల తెలిపారు.

హుజురాబాద్ గడ్డపై యావత్తు తెలంగాణ ప్రజలతో బిజెపి గెలిచిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెరాస నేతలు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బిజెపి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారని, ఎక్కడ చూసినా కేసీఆర్ ను బొంద పెట్టే నినాదం వినిపిస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో అధికారంలోకి వస్తామని మిడిసి పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు మూలమైన యూపీ లోనే కాంగ్రెస్ రెండే సీట్లు గెలిచిందని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంతరించి పోయిందన్నారు.

రాష్ట్రంలోని సర్పంచ్ లు ఎంపీటీసీలు,జెడ్పిటిసీ, ఎంపీపీలు బిజెపి లో చేరుతామని ఫోన్ చేస్తున్నారని ఈటల రాజేందర్ వెల్లడించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బిజెపి లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఏడాదిన్నర కాలం ఉంది.. ఉప ఎన్నికలు వస్తాయని భయపడుతున్నారన్నారు. బిజెపిలోకి కాంగ్రెస్ నేతలు వస్తామని అంటున్నారని ఈటల రాజేందర్ చెప్పారు

Also Read : మిషన్ కెసిఆర్ ఓటమి ఈటెల రాజేందర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్