Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

భూ వివాదాల పరిష్కారం కోసం మండల స్థాయిలోకూడా శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  రాష్ట్రంలో  వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కింద సమగ్ర సర్వే చేపడుతోన్న సంగతి తెలిసిందే.  ఈ పథకం అమలు తీరుపై సిఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాయలంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే….:

  • సర్వే సందర్భంగా కూడా తలెత్తే వివాదాల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉండాలి
  • మొబైల్‌ ట్రైబ్యునల్‌ యూనిట్లు ఉండాలి, దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలి
  • భూ వివాదాల పరిష్కారంపై రాష్ట్రంలో అత్యుత్తమ వ్యవస్థను తీసుకురావాలి
  • శాశ్వత ప్రాతిపదికన ప్రతిమండల కేంద్రంలో కూడా భూ వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్స్‌
  • దీనివల్ల న్యాయపరంగా దక్కే హక్కులను వీలైనంత త్వరగా పొందేందుకు వీలు ఉంటుంది
  • వివాదాల్లో ఉండి తరాలతరబడి హక్కులు పొందలేని పరిస్థితి ఉండకూడదు
  • సర్వే సందర్భంగా ప్రభుత్వంతో వివాదాలు, వ్యక్తిగత వివాదాల ఇలా అంశాల వారీగా గుర్తించాలి
  • సర్వే నంబర్ల జాబితాలో ఈ వివాదాలను కూడా పేర్కొనాలి
  • దీనివల్ల కొనుగోలుదార్లకు ఈ భూమి లీగల్‌గా క్లియర్‌గా ఉందా? లేదా? అన్నది తెలుస్తుంది
  • అదే సమయంలో ఆ వివాదాలను పరిష్కరించే ప్రయత్నంకూడా సమాంతరంగా జరగాలి
  • సర్వే ప్రక్రియలో నాణ్యత అనేది చాలా ముఖ్యం
  • వివాదాల పరిష్కారంలో కూడా అలాంటి క్వాలిటీతో కూడిన ప్రక్రియ ఉండాలి
  • సమగ్ర సర్వే సందర్భంగా వచ్చే అప్పీళ్లపై థర్డ్‌పార్టీ పర్యవేక్షణ కూడా ఉండాలి
  • దీనివల్ల హక్కుదారులకు ఎలాంటి నష్టం చేకూరదు, తప్పులకు పాల్పడే సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది
  • థర్డ్‌పార్టీ పర్యవేక్షణ వల్ల పక్షపాతం, వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుంది
  • బ్బందిలో జవాబుదారీతనం కూడా వస్తుంది
  • ఎవరైనా ఒక వ్యక్తి  తమ భూమిలో సర్వేకావాలని దరఖాస్తు చేసుకుంటే… కచ్చితంగా సర్వే చేయాలి.
  • నిర్ణీత సమయంలోగా సర్వే చేయకుంటే… సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.
  • దీనికోసం ఒక ఎస్‌ఓపీ రూపొందించాలి
  • సర్వేలో ఏరియల్‌ ఫ్లైయింగ్, డ్రోన్‌ఫ్లైయింగ్‌ నెలవారీ లక్ష్యాలను పెంచాలి
  • నెలకు వేయి గ్రామాలను చొప్పున ఇప్పుడు చేస్తున్నామన్న అధికారులు. ఈ లక్ష్యాన్ని పెంచాలన్న సీఎం.
  • మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కూడా సర్వేను వేగవంతం చేయాలన్న సీఎం.
  • 2023 సెప్టెంబరు నెలాఖరు నాటికి సమగ్ర సర్వేను పూర్తిచేస్తామన్న అధికారులు.
  • సమగ్ర సర్వే ప్రక్రియ సమర్థవంతంగా సాగడానికి ప్రఖ్యాత లీగల్‌ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలన్న సీఎం.
  • దీనివల్ల క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్న సీఎం.
  • సర్వే పూర్తయ్యే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సదుపాయం రావాలన్న సీఎం.
  •  రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో మంచి ఎస్‌ఓపీలు పాటించాలన్న సీఎం.
  • నమూనా డాక్యుమెంట్‌ పత్రాలను పౌరులకు అందుబాటులో ఉంచాలని, వాటి ఆధారంతో సులభంగా రిజిస్ట్రేషన్‌ జరిగేలా చూడాలని సీఎం ఆదేశం.
  • అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్‌  ప్రక్రియను చేపట్టాలన్న సీఎం
  • ఈ మేరకు రిజిస్ట్రేషన్‌శాఖను ప్రక్షాళన చేయాలన్న సీఎం.
  • ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఏసీబీ నంబర్‌ స్పష్టంగా కనిపించేలా పోస్టర్, హోర్డింగ్‌ ఏర్పాటు చేయాలన్న  సీఎం.

ఈ సమీక్షా సమావేశంలో ఎనర్జీ,అటవీ పర్యావరణం, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి,  రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, సర్వే సెటిల్మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్దార్ధ జైన్, సీసీఎల్‌ఏ కార్యదర్శి అహ్మద్‌ బాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Also Read : భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: సిఎం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com