Saturday, July 27, 2024
HomeTrending Newsబీజేపీ సెల్లర్స్...కిల్లర్స్ పార్టీ.... జీవన్ రెడ్డి

బీజేపీ సెల్లర్స్…కిల్లర్స్ పార్టీ…. జీవన్ రెడ్డి

జెపి నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాదు భ్రష్టా చార్ జనతా పార్టీ అధ్యక్షుడని పియూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి విమర్శించారు. నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ లో బీజేపీ ఒక లోక్ సభ సీటు తో పాటు మూడు అసెంబ్లీ సీట్లను ఉప ఎన్నికల్లో కోల్పోయిందని, ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని హితవు పలికారు. హైదరాబాద్ టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బిజెపి నేతల వైఖరిని తూర్పారబట్టారు. సొంత రాష్ట్రం లో బీజేపీ ఓడిపోవడం తో నడ్డా మతి స్థిమితం కోల్పోయాడని, నడ్డా అబద్ధాల బిడ్డ గా మారి మిషన్ భగీరథ లో నీళ్లు రాలేవంటున్నారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఉంటుందా అన్నారు. మీ ఎమ్మెల్యేల ఎంపీ ల నియోజవర్గాల్లో ఎక్కడికైనా వెళ్దాం మిషన్ భగీరథ నీళ్లు రాలేదంటే దేనికైనా సిద్ధం అని జీవన్ రెడ్డి సవాల్ చేశారు. బీజేపీ సెల్లర్స్, కిల్లర్స్ పార్టీ గా మారిందని, బండి సంజయ్ కు అదే స్క్రిప్ట్ అమిత్ షా నడ్డా లకు ఒకే స్క్రిప్ట్ రాసి బీజేపీ నేతలు అభాసు పాలయ్యారని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎలాంటి అవినీతి జరగలేదని రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమే పార్లమెంటు లో సమాధాన మిచ్చిందని, బీజేపీ దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతుందని జీవన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం పై అడ్డదిడ్డంగా మాట్లాడిన నడ్డాను అర్జెంటుగా ఎర్రగడ్డ ఆస్పత్రి లో చేర్చాలని, బీజేపీ ఏ టు జడ్ స్కాం ల పార్టీ అని ఆరోపించారు. అనుచితమైన భాష మాట్లాడుతున్న ఎంపీ అరవింద్ తదితర నేతల పై పోలీసులు తక్షణమే పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. పోలీసులు ఇక కఠినంగా వ్యవహరించాలన్నారు. నడ్డా ఇది తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని గ్రహించాలని, బీజేపీ ఆఫీస్ లో తాగేది మిషన్ భగీరథ నీళ్లే… సంజయ్ జైల్లో తాగేది కూడా మిషన్ భగీరథ నీళ్లే అని గుర్తు చేశారు. బీజేపీ నేతలకు బెంగాల్లో పట్టిన గతే తెలంగాణ లో పడుతుందన్నారు.
రేవంత్ కు మెంటలెక్కి బీజేపీ టీ ఆర్ ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తున్నారని, అన్ని ఉపఎన్నికల్లో బీజేపీ తో కుమ్మక్కయిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. సంజయ్ అరెస్టుతో తెలంగాణ ప్రశాంతంగా ఉందని, సంజయ్ పై ఎన్నో కేసులు ఉన్నాయి.. ఆయన నేర చరిత్రను బట్టే పోలీసులు వ్యవహరించారన్నారు. టీ.ఆర్.ఎస్ కు ప్రత్యామ్నాయo ఎవరో కాంగ్రెస్, బీజేపీ లే తేల్చుకోవాలన్నారు.

Also Read : బండి సంజయ్ కు బెయిల్ నిరాకరణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్