Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్చిలకం కన్నుమూత

చిలకం కన్నుమూత

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చిలకం రామచంద్ర రెడ్డి అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చిలకం మృతి పట్ల ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంభసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు చిలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1999లో బిజెపి-టిడిపి కలిసి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాయి. చంద్రబాబు రెండోసారి సిఎం పగ్గాలు చేపట్టిన కొంత కాలానికే చిత్తూరు జిల్లాకే చెందిన చిలకం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయనకు చంద్రబాబు ఎంతో గౌరవం ఇచ్చేవారు.

రాయలసీమ అభివృద్ధి కోసం, తాగు- సాగు నీటికోసం చిలకం రామచంద్ర రెడ్డి చేసిన పాదయాత్ర కూడా చేశారు. కోవిడ్ మొదటి దశ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చిలకం రామచంద్ర రెడ్డిని ఫోన్ ద్వారా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. రేపు తిరుపతి సమీపంలో ఉన్న వారి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్