Saturday, November 23, 2024
HomeTrending Newsఓటుబ్యాంకు రాజకీయాలు మానుకోండి: బిజెపి

ఓటుబ్యాంకు రాజకీయాలు మానుకోండి: బిజెపి

Nirasana Sabha: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పెట్రేగిపోతున్న పిఎఫ్ఐ, ఎస్డీపిఐ ఆగడాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు అరుణ్ సింగ్ ప్రభుత్వానికి సూచించారు. కర్ణాటకలో  ఈ రెండు సంస్థలనూ  ప్రోత్సహించి, వారిని పెంచి పోషించినందుకే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఈ విషయాన్ని సిఎం జగన్ గుర్తుంచుకోవాలని అయన హెచ్చరించారు. ఆత్మకూరులో బిజెపి జిల్లా బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసులు ఉపసంహరించాలని, ఆయనపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని అయన డిమాండ్ చేశారు. బీజేపీతో పరాచకాలు వద్దని జగన్ కు సూచించారు. ఆత్మకూరు సంఘటనను నిరసిస్తూ బిజెపి ఆంధ్రప్రదేశ్ నేడు కర్నూలులో ‘ప్రజా నిరసన సభ’ నిర్వహించింది. ఈ సభకు అరుణ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ సింగ్ మాట్లాడుతూ ఏపీ లో బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలు మానకుంటే ఇబ్బందులు తప్పవన్నారు.

సీఎం జగన్ కు సద్బుద్ధి కలిగించాలంటూ భజనలు, యజ్ఞం చేయడం, విగ్రహాల వద్ద నిరసన తెలిపాలని అరుణ్ సింగ్ బిజెపి కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో  1వ తారీఖు ఉద్యోగులకు జీతం, పెన్షన్ ఇవ్వడం లేదని,  ఏపీలో ఖజానా ఖాళీ అయిందని, ప్రభుత్వం దివాళా తీసిందని ఆరోపించారు.

మద్యం, ఇసుక మాఫియా కారణంగా ఖజానా ఖాళీ అయిందని, ఏపీ ప్రభుత్వం పీఆర్ సి ద్వారా ఉద్యోగులకు జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించిందని విమర్శించారు. ప్రభ్యుత్వం ఇప్పటికైనా సక్రమంగా పరిపాలించి అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ కార్యకర్తలపై దౌర్జన్యాలను అడ్డుకునేందుకు అండగా ఉంటామని, పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలు లేకపోయి ఉంటె ఈ సభకు వేలాదిగా జనం వచ్చి ఉండేవారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు సిఎం రమేష్, టిజి వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సే పీవీఎన్ మాధవ్, రాష్ర బిజెపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also read : వెనకబడ్డ జిల్లాల్లో అభివృద్ధిపై పిఎం సమీక్ష

RELATED ARTICLES

Most Popular

న్యూస్