Sunday, September 8, 2024
HomeTrending News15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు: సోము

15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు: సోము

We only:  కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏర్పడి ఎనిమిదేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. మోడీ నేతృత్వంలో అభివృద్ధి మాత్రమే జరుగుతోందని,  అవినీతికి ఎక్కడా చోటే లేదని స్పష్టం చేశారు. అవినీతి  ఉన్న రాష్ట్రాలలో అభివృద్ది లేదని, దానికి మన రాష్ట్రమే ఓ ఉదాహరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.  ఈ నెల 6న రాజమండ్రిలో నిర్వహిస్తున్న సభకు సంబధించి ‘గోదావరి గర్జన’ కరపత్రాన్ని విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోము వీర్రాజు ఆవిష్కరించారు. అనతరం నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రం అభివృద్ది జరగాలంటే మోడి ఆలోచనలు ఉన్న ప్రభుత్వం ఇక్కడ కూడా ఏర్పడాలని,  ఆంధ్ర ప్రదేశ్ అంటే మోడికి ప్రత్యేక అభిమానం ఉందని, అందుకే 53 లక్షల మందికి E శ్రమ్ కార్డులు ఇచ్చారని సోము చెప్పారు. 15 రోజులుపాటు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

అమలాపురంలో అల్లర్లకు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలే కారణమని ఆరోపించిన వీర్రాజు, మీలాభం కోసం కొన్ని వర్గాల ను ఇబ్బంది పెడితే బిజెపి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.  అమలాపురం లో ఇంటర్నెట్ సేవలు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరిట బిజెపి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, దేశంలో ఎక్కడా ఆయనపై వ్యతిరేకత లేదని, ఒక్క  అమలాపురంలోనే ఈ వ్యతిరేకత ఎందుకొచ్చిందో సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

ఈనెల 6న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తారని, శక్తి కేంద్రాలను సందర్శిస్తారని, గోదావరి గర్జన పేరుతో రాజమండ్రి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతికత పై పోరాటం చేస్తామన్న సోము,  ఆత్మకూరు ఉప ఎన్నికలో బిజెపి పోటి చేస్తుందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్