మహారాష్ట్ర లో ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. ఇది పాము తన పిల్లలను తానే తిన్నట్టు గా ఉందన్నారు. హైదరాబాద్ గాంధి భవన్ లో ఈ రోజు మీడియాతో మల్లు రవి మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడ్డ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
దేశంలో ఎక్కడ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న వాటిని అస్థిరపరచి అక్కడ రాజకీయ సంక్షోభం సృష్టించి లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని మల్లు రవి ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదే.. దీన్ని ప్రజాస్వామ్య వాదులు హర్షించరన్నారు. గతంలో మధ్యప్రదేశ్, గోవా, అస్సాం తదితర రాష్ట్రాలలో కూడా బీజేపీ ఇలాగే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని గుర్తు చేశారు. ఇలాగే చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చి రాబోయే ఎన్నికలలో బీజేపీ భూ స్థాపితం అవుతుందని మల్లు రవి హెచ్చరించారు.
Also Read : శివసేనలో ముసలం