Thursday, January 23, 2025
HomeTrending NewsFlying Kiss: మరో వివాదంలో రాహుల్ గాంధీ

Flying Kiss: మరో వివాదంలో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పార్లమెంట్ నుంచి వెళ్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడంపై ఇప్పుడు దుమారం రాజుకుంది. పార్లమెంట్ నుంచి రాజస్థాన్ వెళ్లడం కోసం బయటకు వెళ్తున్న క్రమంలో ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అయితే దీనిపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ స్మృతీ ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ ప్రవర్తనపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు. “నేను ఒక విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. నా ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన వ్యక్తి వెళ్లే ముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళా సభ్యులు కూర్చున్న పార్లమెంట్ కు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం అంటే ముమ్మాటికీ స్త్రీ ద్వేషపూరిత వ్యక్తి మాత్రమే అలా చేయగలడు. ఇలాంటి అసభ్యకర ప్రవర్తన గతంలో ఎప్పుడూ కూడా పార్లమెంట్ లో చూడలేదన్నారు”. రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ మహిళా మంత్రులు, ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుతో సీసీ ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్