Saturday, November 23, 2024
HomeTrending Newsసియాల్ కోట్ పేలుడు చిక్కుముడి వీడింది

సియాల్ కోట్ పేలుడు చిక్కుముడి వీడింది

Blast At Pakistan Arms Depot:

రెండు రోజుల క్రితం (ఆదివారం) మధ్యాహ్నం పాకిస్థాన్ లోని సియాల్ కోట్ ఆయుధ డిపోలో పేలుడు సంభవించింది. మొదట పెద్ద శబ్దంతో మంట వచ్చింది వెంటనే వరసగా ఒక దాని తరువాత ఒకటి పెద్ద పెద్ద పేలుళ్లు జరిగాయి. మొదట్లో ప్రమాదవశాత్తూ పేలుళ్లు జరిగాయని అందరు భావించారు. పాక్ లోని స్థానిక మీడియా మాత్రం ప్రస్తుతం ఇమ్రాంన్ ఖాన్ ని రాజీనామా చేయమని సైన్యం వత్తిడి తెస్తున్న సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ కి మద్దతుగా ఎవరో కావాలనే నిప్పు పెట్టారా అంటూ వ్యాఖ్యానించాయి.

JC-10C జెట్ ఫైటర్ కారణం ?

ఇటీవలే పాకిస్థాన్ చైనా నుండి సింగిల్ ఇంజిన్ కలిగిన అమెరికన్ F-16 కాపీ కాట్ అయిన JC-10 C ఫైటర్ జెట్స్ ని దిగుమతి చేసుకున్నది. ఇవి భారత్ వద్ద ఉన్న రాఫెల్ జెట్ ఫైటర్స్ కి సమాధానం అని పాకిస్థాన్ చెప్పుకొచ్చింది. అయితే JC-10C ఫైటర్ జెట్ కి చైనా తయారీ లాంగ్ రేంజ్ AIR to AIR మిసైల్ PL-15 ని అమర్చి దానిని టెస్ట్ ఫైర్ చేయగా అది టార్గెట్ ని కొట్టకుండా గురి తప్పి నేరుగా సియాల్కోట్ లోని పాక్ ఆయుధ డిపో మీద పడి పేలిపోయింది. దాంతో మొత్తం ఆయుధ డిపోలో మందుగుండు సామాగ్రి అగ్నికి ఆహుతి అయిపొయింది.

చైనా తయారీ PL-15 AIR to AIR BVR మిసైల్ !

నిజానికి PL-15 BVR మిసైల్ రేంజ్ వచ్చి 150 – 200 km మధ్య ఉంటుంది. చైనా మాత్రం ఇంకా ఎక్కువే అని ప్రకటించింది. అయితే PL-15 ని చైనా తయారుచేసింది పసిఫిక్ మహా సముద్రంలో అమెరికన్ AWACS మరియు ట్రాన్స్పోర్ట్ విమానాలని కూల్చడానికి మాత్రమె. AWACS కానీ ఆకాశంలో జెట్ ఫైటర్స్ కి ఇంధనం సప్లయ్ చేసే టాంకర్ లు కానీ  ఎక్కువ వేగంతో వెళ్ళలేవు అదే సమయంలో వేగంగా తిరగలేవు [maneuver] కాబట్టి లాంగ్ రేంజ్ మిసైల్ కి సులభంగా దొరికిపోతాయి. వీటిని స్టేషనరీ టార్గెట్లు అంటారు మిలటరీ భాషలో.

చైనా,పాకిస్థాన్ దేశాలు PL-15 BVR గురుంచి చెప్పుకునే గొప్పలు…

AESA రాడార్ కలిగి,RAM JET ఇంజిన్ తో వేగంగా దూసుకుపోగల మిసైల్ అని. కానీ రాఫెల్ కి ఉన్న SPECTRA EW శత్రు దేశపు మిసైల్ కి ఉన్న AESA రాడార్ ని జామ్ చేయగలదు. 200 km దూరంలో ఉన్న PL -15 ని ముందే పసిగట్టి దాని రాడార్ ని జామ్ చేయగలదు SPECTRA EW. పైగా వేగంగా maneuver అవగల రాఫెల్ ని PL-15 ఎలా టార్గెట్ చేయగలదు ? అసలు చైనా డిజైన్ చేసిందే మెల్లగా,భారంగా వెళ్ళే విమానాలని కూల్చడం కోసం అదీ దాని పని తీరు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. నిన్న జరిగిన సంఘటనతో తెలిసింది ఏమిటంటే మిసైల్ ఎవియానిక్స్ పని తీరు చాల ఘోరంగా ఉందని వెల్లడైంది.

బహుశా భారత్ బ్రహ్మోస్ మిసైల్ ని పాకిస్థాన్ భూభాగoలోకి పంపించింది కదా దానికి ప్రతీకారంగా 200 km పరిధి గల PL-15 ని భారత్ భూభాగంలోకి ప్రయోగించాలని పాక్ తాపత్రయపడి ఉండవచ్చు. ఇక సియాల్ కోట్ కంటోన్మెంట్ లో ఉన్న ఆయుధ డిపో 1852 లో బ్రిటీష్ ఇండియా ఆర్మీ కాలంలో స్థాపించిన పురాతన కంటోన్మెంట్. వ్యూహాత్మకంగా భారత్ సరిహద్దులకు కీలకమైన ప్రదేశంలో ఉంది సియాల్ కోట్ కంటోన్మెంట్ లో ఉన్న ఆయుధ డిపో. ఇప్పుడు అది కాస్తా మొత్తం ద్వంసం అయింది.

Also Read : చైనాలో ఘోర విమాన ప్రమాదం

RELATED ARTICLES

Most Popular

న్యూస్