పాకిస్తాన్ లోని పంజాబ్-సింధ్ సరిహద్దులో సింధు నదిలో పెళ్లి వేడుకకు వెళ్తున్న పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 23 కు చేరింది. చనిపోయినవారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. నీటిలో పడిపోయిన వారికోసం నిరంతరం గాలిస్తున్నారు. రహీమ్ యార్ ఖాన్‌కు దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్కాలో ఒకే వంశానికి చెందిన 100 మందితో సహా వివాహ బృందంలోని ఇతర సభ్యులను కనుగొనడానికి విస్తృతంగా అన్వేషణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు.. 23 మంది మృతదేహాలను అధికారులు బయటకు తీశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
వేడుక పూర్తి చేసుకొని తిరిగి వస్తుండగా సదికాబాద్ జిల్లాలోని రాజన్ పూర్ నుంచి మచ్క మధ్యలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పరిమితికి మించి పడవలో ఎక్కువమంది ప్రాయనించటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. గత నాలుగు రోజులుగా పంజాబ్ రాస్ష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. దీంతో సింధు నదితో పాటు ఇతర ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.