మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. చిరంజీవికి జంటగా శృతిహాసన్;  రవితేజకు జంటగా కేథరిన్ నటించారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. టీజర్, సాంగ్స్ అండ్ ట్రైలర్ కు అనూహ్య స్పందన రావడంతో మూవీపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

జనవరి 13న వాల్తేరు వీరయ్య చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ట్ రివీల్ చేసారు. ముఖ్యంగా బాబీ రివీల్ చేసిన టైటిల్  కహాని ఆసక్తికరంగా ఉంది. అదేంటంటే… యాగంటిలో వెంకీ మామ షూటింగ్ చేస్తున్నప్పుడు దక్షిణాఫ్రికా నుండి నాజర్ గారి స్నేహితుడు వచ్చి బాబీకి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారట. దక్షిణాఫ్రికాకు సంబంధించిన ఆ పుస్తకంలో  వీరయ్య అనే తెలుగు పదం ఉందట.

దీంతో ఆ పేరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందట. అదే పేరు  గుడిలో వచ్చిందట. అప్పటికే మనసులో ఆ పేరుతో సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారన బాబీ. ఆ తర్వాత ఒక అభిమాని బాబీకి ఒక వీడియో పంపారట. అందులో చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముందు వీరయ్య అనే వ్యక్తి తనకు సహాయం చేశారని చెప్పారట. దీంతో ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య తప్ప మరో టైటిల్  ఊహించుకోలేకపోయానని, మరో ఆలోచన లేకుండా ఆ టైటిల్ ఫిక్స్ చేసానని బాబీ చెప్పారు.  ఈ విషయాలన్ని చిరంజీవి గారికి చెబితే ఆయన ఇంకేమి ఆలోచించకు అని ప్రోత్సహించారంటూ వాల్తేరు వీరయ్య టైటిల్ వెనకున్న సీక్రెట్ బయటపెట్టారు బాబీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *