Thursday, June 18, 2026
HomeసినిమాBobby- Bellamkonda: బాబీతో బెల్లంకొండ సినిమా..?

Bobby- Bellamkonda: బాబీతో బెల్లంకొండ సినిమా..?

 ‘అల్లుడు శీను’ సినిమాతో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే కమర్షియల్ సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ‘సరైనోడు’, ‘జయ జానకి నాయక’, ‘సీత’ తదితర చిత్రాలతో యూత్ లో మంచి గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు ఛత్రపతి మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ లో బెల్లంకొండను పరిచయం చేసిన వినాయకే బాలీవుడ్ లో కూడా పరిచయం చేయడం విశేషం. ఇప్పుడు తెలుగు సినిమా పై దృష్టి పెట్టబోతున్నాడు. అయితే.. ఎవరితో సినిమా చేయనున్నాడు అంటే మెగా డైరెక్టర్ బాబీ పేరు వినిపిస్తుంది.

చిరంజీవితో  ‘వాల్తేరు వీరయ్య’ రూపొందించి హిట్ కొట్టిన బాబీ రజనీకాంత్ తో సినిమా తీయాలని అనుకున్నా ‘జైలర్’  మూవీ తర్వాత రెండు సినిమాలను ప్రకటించారు కానీ.. బాబీతో సినిమాని అనౌన్స్ చేయలేదు. దీంతో బాలయ్య కోసం బాబీ కథ రెడీ చేయడం, బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చచకా జరిగాయి.  దీనికంటే ముందు బోయపాటితో బాలయ్య మూవీ చేయాల్సి ఉంది. ఆ తర్వాతే బాబీ మూవీ పట్టాలెక్కనుంది…  ఈలోపు ఓ సినిమా చేసేలా బాబీ  ప్లాన్ చేస్తున్నారట.

అది బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో అని సమాచారం. ఇప్పటికే బెల్లంకొండ ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాతను రెడీ చేశారని తెలిసింది. ఈ మూవీని తెలుగు, హిందీలో చేయాలా..? లేక ఒక్క తెలుగులోనే చేయాలా..? అనేది ఆలోచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular