Saturday, June 6, 2026
Homeసినిమా'ఆదిపురుష్’ శబరి క‌న్నుమూత‌

‘ఆదిపురుష్’ శబరి క‌న్నుమూత‌

ప్రభాస్, కృతి సనన్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమాలో శబరి పాత్ర పోషించిన ఆశా శర్మ కన్నుమూశారు.  గత సాయంత్రం ఆమె కన్నుమూశారు. దీనితో  సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ఆమె వ‌య‌సు 88 సంవ‌త్స‌ రాలు. ఆమె మృతికి గ‌ల కార‌ణాలు వెల్ల‌డికాలేదు. ఆమె మ‌ర‌ణించిన విష‌ యాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ధ్రువీక‌ రించింది. మ‌రో నటిని ప‌రిశ్ర‌మ కోల్పోయిందని వెల్లడించింది.

ఆశా శ‌ర్మ సినిమాల కంటే బుల్లితెర‌పై మంచి గుర్తింపు సాధించారు. ‘కుంకుమ్ భాగ్య’ సీరియ‌ల్ ఆమెకు మంచి పేరు తీసుకువ‌చ్చింది. సీరియ‌ల్స్‌లోనే కాకుండా ప‌లు చిత్రాల్లోనూ ఆమె న‌టించింది. ఎక్కువ‌గా త‌ల్లి, అమ్మ‌మ్మ పాత్ర‌ల్లో న‌టించింది.దో దిశయాన్’, ‘ముఝే కుచ్ కెహనా హై’, ‘ప్యార్ తో హోనా హి థా’, ‘హమ్ తుమ్హారే హై సనమ్’ వంటి మూవీల్లో న‌టించింది.

1982లో హేమమాలిని, ధర్మేంద్ర నటించిన ‘దో దిశాయేన్’ చిత్రంలో శ్రీమతి నివారణ్ శర్మ పాత్రను ఆశా పోషించింది. ఈ చిత్రంలో ఆమె న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఆదిపురుష్ మూవీలో ఆశా శర్మ క‌నిపించింది త‌క్కువ సేపే అయినా కూడా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular