Saturday, January 18, 2025
Homeసినిమాచిరు సరసన బాలీవుడ్ భామలు?

చిరు సరసన బాలీవుడ్ భామలు?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ తిరిగి సెట్స్ పైకి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్ లో నటించనున్నారు. దీనికి మోహన్ రాజా దర్శకుడు.  అలాగే చిరంజీవి.. డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

అయితే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించేందుకు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను చిత్రయూనిట్ కాంటాక్ట్ చేసినట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. డైరెక్టర్ బాబీ సోనాక్షిని కలిసి కథ చెప్పారని.. కథ నచ్చి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. అయితే.. అధికారికంగా ప్రకటించాల్సివుంది. అలాగే మరో బాలీవుడ్ భామ బిపాసబసును కూడా కాంటాక్ట్ చేసారని వార్తలు వస్తున్నాయి. ప్రచారంలో ఉన్న వార్తల పై క్లారిటీ రావాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్