Saturday, January 18, 2025
Homeసినిమామ‌రో మూవీకి ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా?  

మ‌రో మూవీకి ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా?  

Prabhas New One: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఆదిపురుష్‌, స‌లార్, ప్రాజెక్ట్ కే చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఈ మూడు చిత్రాల్లో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుంది. స‌లార్, ప్రాజెక్ట్ కే షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. ఈ సినిమాల‌తో పాటు సందీప్ రెడ్డి వంగ డైరెక్ష‌న్ లో స్పిరిట్ అనే సినిమా చేయ‌నున్నారు. అలాగే మారుతి డైరెక్ష‌న్ లో కూడా ఓ సినిమా చేయ‌నున్నారు. ద‌స‌రాకి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మ‌రో సినిమాకి ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… బాలీవుడ్ డైరెక్ట‌ర్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి ప్ర‌భాస్, సిద్ధార్థ్ గ‌త సంవ‌త్స‌రం నుంచి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు కానీ.. వాళ్లిద్ద‌రూ బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి రాలేదు.

ప్రభాస్, సిద్థార్థ్ ఆనంద్ కమిట్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకురానున్నారు. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. ఇది ఆడియ‌న్స్ కి థ్రిల్ క‌లిగించే భారీ యాక్ష‌న్ మూవీ అని స‌మాచారం. ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్‌ నటిస్తోన్న పఠాన్‌కి దర్శకత్వం వహిస్తున్నారు సిద్ధార్థ్. అలాగే హృతిక్ రోషన్‌తో ఫైటర్ కూడా చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో  ప్ర‌భాస్, సిద్ధార్థ్ ఆనంద్ చేసే భారీ యాక్ష‌న్ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వ‌స్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి ఓకేసారి మూడు పండ‌గ‌లు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్