Tuesday, June 16, 2026
Homeసినిమామహేష్ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్..?

మహేష్ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా చిత్రాలు రూపొందాయి. ఈ రెండు చిత్రాలు ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మూడవ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్‌ బాబుకు జంటగా క్రేజీ హీరోయిన్స్ పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రను సీనియర్ హీరోయిన్ శోభనతో చేయించాలి అనుకుంటున్నారని టాక్ వినిపించింది. ఆతర్వాత శోభన కాదు.. రమ్యకృష్ణ అని వార్తలు వచ్చాయి కానీ.. ఇంత వరకు అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. తాజా వార్త ఏంటంటే.. ఆ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ను తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ సీనియర్ హీరోయిన్స్ తో కీలక పాత్ర చేయించడం ఆనవాయితీ. ఇప్పటి వరకు తన సినిమాల్లో నదియా, టబు, ఖుష్బూలతో కీలక పాత్రలు చేయించారు.

ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ఇందులో నటించడం నిజమైతే.. ఏ పాత్ర చేయించనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమా కోసం సారథి స్టూడియోలో ఓ భారీ సెట్ కూడా వేశారట. ఇందులో యాక్షన్ సీన్స్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఈ సినిమాతో మహేష్ మరో బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని టాక్ వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular