Tuesday, June 16, 2026
Homeసినిమారామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్' లో విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్..

రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ లో విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్..

రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. లైగర్ తర్వాత పూరి దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు. ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలని కసితో కథ రాశారు. పూరి చెప్పిన కథ విన్నవెంటనే రామ్ ఓకే చెప్పారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో డబుల్ ఇస్మార్ట్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్  ముంబాయిలో స్టార్ట్ చేశారు. ఇటీవల రామ్ మరి కొంత మంది ఫైటర్స్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిస్తోన్నారు.

అందుకు అనుగుణంగానే నేషనల్ క్రేజ్ ఉన్న నటులను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో ముఖ్యమైన బిగ్ బుల్ పాత్రను బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పోషిస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని తాజాగా సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఈ సీనియర్ హీరో పూరీ మార్కు స్టైలిష్ గెటప్‌తో కనిపించారు.

ఇదిలా ఉండగా.. ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇందులో నటించే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular