Wednesday, April 17, 2024
HomeసినిమాPushpa 2: 'పుష్ప 2' లో బాలీవుడ్ స్టార్.?

Pushpa 2: ‘పుష్ప 2’ లో బాలీవుడ్ స్టార్.?

అల్లు అర్జున్, సుకుమార్.. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా అంచనాలకు మించి సెన్సేషన్ క్రియేట్ చేసింది… బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో పుష్ప సీక్వెల్ ‘పుష్ప 2’ పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పుష్ప 2 అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల వైజాగ్, హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న పుష్ప 2 కోసం విదేశాల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అతిథి పాత్ర చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర బన్నీ పాత్రను  పరిచయం చేస్తుందట. అలాగే ఈ గెస్ట్ రోల్ థ్రిల్లింగ్ క్యారెక్టర్ గా నిలిచి ఆడియన్స్ కి థ్రిల్ కలిగిస్తుందని టాక్ వినిపిస్తోంది. దీంతో పుష్ప 2 పై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే.. గెస్ట్ రోల్ చేసే బాలీవుడ్ స్టార్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు మేకర్స్. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ.. అంచనాలకు మించి పుష్ప 2 ఉండేలా సుకుమార్ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారట.

ఈ మూవీ కోసం బడ్జెట్ లో పరిమితులు పెట్టుకోకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఒకవేళ డిసెంబర్ కి రిలీజ్ చేయడం కుదరకపోతే…. సమ్మర్ లో విడుదల చేయాలి అనేది ప్లాన్. ఏది ఏమైనా పుష్ప 2 విడుదల ఎప్పుడు అనేది క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : ‘పుష్ప 2’ లో ఫిదా బ్యూటీ నిజమేనా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్