Sunday, November 24, 2024
HomeTrending Newsఆఫ్ఘన్లో బాంబు పేలుడు..20 మంది మృతి

ఆఫ్ఘన్లో బాంబు పేలుడు..20 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌ లోని హెరాత్‌లో శుక్రవారం దారుణం జరిగింది. గుజర్గాహ్ మసీదు వద్ద సంభవించిన పేలుడు వల్ల ప్రముఖ మత పెద్ద ముజీబుల్ రహమాన్ అన్సారీ ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల కథనం ప్రకారం రహమాన్‌తోపాటు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘన్ వాయువ్య ప్రాంతంలోని హేరాత్ లో ఈ రోజు మధ్యాహ్నం ప్రార్థన సమయంలో జరిగిన ఈ ఘటనలో సుమారు 200 మంది గాయపడ్డారు.

ప్రార్థనలు చేసేందుకు పెద్ద ఎత్తున ముస్లింలు హాజరైన సమయంలో ఈ పేలుడు సంభవించడంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉంది. ముజీబుల్ రహమాన్ అన్సారీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మత పెద్ద. పాశ్చాత్య దేశాల మద్దతుతో నడిచే ప్రభుత్వాలను ఆయన దుయ్యబడుతూ, విమర్శిస్తూ ఉండేవారు. ఆయన తాలిబన్లకు అత్యంత సన్నిహితుడు. ఆయన మరణించినట్లు తాలిబన్ ప్రధాన అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు.

ఆఫ్ఘనిస్తాన్లో కాబుల్, కాందహార్ తర్వాత మూడో పెద్దనగరం హెరాత్ లో పేలుడు జరగటం తాలిబాన్ల పాలనను సవాల్ చేసినట్టైంది. ఇదిలావుండగా, ఈ పేలుడుకు బాద్యత తమదేనని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదు. అయితే ఇసిసిస్ ఖొరాసాన్ ఉగ్రవాదుల పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Also Read : కాబుల్ మసీదులో బాంబు పేలుడు..20 మంది మృతి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్