Saturday, November 23, 2024
HomeTrending Newsఅమెరికాలో మైనస్‌ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు

అమెరికాలో మైనస్‌ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు

అమెరికాలో ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని హిమపాతం ప్రజలను కలవరపెడుతోంది. బాంబ్‌ సైక్లోన్‌ వణికిస్తున్నది. మంచుతుఫాన్‌ కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్‌ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కనీసం బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొన్నది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 17 లక్షల ఇండ్లు, వ్యాపార సంస్థలు అంధకారంలోకి జారుకున్నాయి. ముఖ్యంగా 13 రాష్ట్రాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పవర్‌ ప్లాంట్‌లను నడపడం కష్టసాధ్యంగా ఉందని మేజర్‌ గ్రిడ్‌ అధికారులు తెలిపారు.

దేశంలోని 60 శాతం మందిపై ఈ మంచు తుఫాను ప్రభావం పడింది. దేశ వ్యాప్తంగా 5,700 విమానాలను రద్దు చేశారు. పలు చోట్ల రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఆయా రహదారులను మూసివేశారు. క్రిస్మస్‌ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. తుఫాన్‌ కారణంగా 19 మంది మృత్యువాతపడ్డారు. క్రిస్మస్‌ ముందు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో ఫ్లోరిడా, మేరిలాండ్‌, న్యూజెర్సీ, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, కెంటకీ తదితర ప్రాంత ప్రజలు వేడుకలకు దూరంగా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్