Monday, June 8, 2026
Homeసినిమాహాట్ టాపిక్ గా ధనుశ్ - ఐశ్వర్య విడాకులు!

హాట్ టాపిక్ గా ధనుశ్ – ఐశ్వర్య విడాకులు!

Another Divorce: టాలీవుడ్ లో చైతూ .. సమంత విడాకుల విషయాన్ని వాళ్లిద్దరూ మరిచిపోయారేమోగాని, అభిమానులు మాత్రం ఇంకా బాధపడుతూనే  ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీకి గల నేపథ్యం .. చైతూ వ్యక్తిత్వం కారణంగా చాలామంది కూడా సమంతకి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. వాళ్లిద్దరూ కలిసి ఉండాలని కోరుకున్నారు. ఇద్దరూ కలిసి మళ్లీ సినిమాలు చేయాలని భావించారు. సోషల్ మీడియా ద్వారా తమ అభ్యర్థనలను అదే పనిగా పోస్టు వెళ్లారు. కానీ చైతూ .. సమంత ఇద్దరూ కూడా ఇక నుంచి తమ దారులు వేరు అనే విషయాన్నే స్పష్టం చేస్తూ వెళ్లారు.

ఇక ఇప్పుడు హఠాత్తుగా ధనుశ్ బాంబ్ పేల్చాడు. తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్టుగా ట్విట్టర్ లో పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో ధనుశ్ వివాహమై 18 ఏళ్లు అయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో వాళ్లిద్దరూ అప్పుడప్పుడూ పోస్ట్ చేసే ఫోటోలు చూస్తే, ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలా ఉన్నారు కనుకనే ఆ ఫోటోలు అలా బయటికి వచ్చాయి. కానీ ఇంతలో ఏమైందో ఏమోగానీ, విడిపోవాలనే తమ నిర్ణయాన్ని గౌరవించండి అంటూ ధనుశ్ కోరాడు.

ఇంతవరకూ స్నేహితులుగా .. భార్యా భర్తలుగా .. తల్లిదండ్రులుగా ఉన్నామనీ, ఇక తమ ప్రయాణం వేరు వేరు మార్గాల్లో సాగనుందని చెప్పాడు. ఈ విషయంలో మాకు అవసరమైన గోప్యతకు అవకాశం ఇవ్వండి అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. ఒక వైపున రజనీ వ్యక్తిత్వం .. ఆయన క్రేజ్, మరో వైపున 18 ఏళ్ల వైవాహిక జీవితం .. ఇద్దరు పిల్లలు .. వాళ్ల మనోభావాలు. వాటినన్నిటినీ పక్కన పెట్టేసి ధనుశ్ – ఐశ్వర్య ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular