తనకు, వసంత కృష్ణ ప్రసాద్ కు మధ్య గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు.  నేటి ఉదయం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మొదలైన నాటి నుంచి ఈ ప్రచారం మొదలు పెట్టారన్నారు. ఇది పరమ కిరాతకమైనదని, తల్లిదండ్రులకు సక్రమంగా పుట్టినవారెవరూ ఇలా చేయరని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

పార్టీ పరంగా ఏ అభ్యర్ధికి ఎవరెవరు ఓటు వేయాలనే దానిపై కొంతమంది కోర్డినేటర్ లను నిమమించారని, తాను చూస్తున్న ఎమ్మెల్యేల్లో వసంత లేరని పేర్ని వెల్లడించారు. ఉదయం 8.45గంటలకే ఆయన అసెంబ్లీకి వచ్చారని, టీ విరామం సమయంలో తన ఓటు వేశారని చెప్పారు. అసెంబ్లీ లాబీల్లో కలిసినప్పుడు ఓటు వేశారా అన్నా అని అడిగితే ఇప్పుడే వెళుతున్నానంటూ సమాధానమిచ్చారని నాని వివరించారు. వసంతను తాను ఏదో అన్నట్లు, అయన తనను దూషించినట్లు హేయమైన ప్రచారం చేయడం, పైగా దాన్ని మీడియా గ్రూపుల్లో కూడా షేర్ చేయడం దారుణమన్నారు. ఇలా చేసే వారు ఇంతకంటే నీచమైన బతుకు వేరేది వెతుక్కోవాలని సలహా ఇచ్చారు.

తన తండ్రి వసంత నాగేశ్వర రావు, వారి తండ్రి పేర్ని కృష్ణ మూర్తి గారు మంచి మిత్రులను అలాగే ఇప్పుడు పేర్ని నాని రాజకీయంగా తనకు సీనియర్ అని, మంత్రిగా ఉండగా తానూ ఏ సమస్య వచ్చినా నాని వద్దకు వెళ్లి పరిష్కరించుకునే వాడినని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. తనకు గిట్టకపోయినా వారితో గొడవ పెట్టుకునే మనస్తత్వం కాదన్నారు. కొంతమంది గిట్టనివారు ఇలా చేశారని, వారెవరో కూడా తమకు తెలుసన్నారు.  పేర్నిని తాను దుర్భాషలాడినట్లు వచ్చిన వార్త చూసి మనస్సు చివుక్కుమందని వసంత ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : A Tribute: అతడు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *