Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్సింధు, సతీష్, అతాను దాస్ ల విజయం

సింధు, సతీష్, అతాను దాస్ ల విజయం

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియాకు పురుషుల హాకీ జట్టు విజయంతో పాటు మరో మూడు వ్యక్తిగత విజయాలు గురువారం నాడు లభించాయి. ఇండియా బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు మరో విజయం నమోదు చేసుకున్నారు, ప్రీ క్వార్టర్స్ లో డెన్మార్క్ కు చెందిన ­12వ ర్యాంక్ క్రీడాకారిణి బలిచ్ ఫెల్డ్ పై 21-15, 21-13 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది.

మరోవైపు ఇండియన్ బాక్సర్ సతీష్ కుమార్ ప్రీ క్వార్టర్స్ లో జమైకాకు చెందిన రికార్డో బ్రౌన్ పై 4-1 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్ లోకి అడుగు పెట్టాడు, అక్కడ ఉజ్బెకిస్తాన్ కు చెందినా బాఖోదిర్ తో తలపడనున్నాడు.

ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్ ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు. 1/32 ఎలిమినేషన్ రౌండ్లో  చైనా కు చెందినా డెంగ్ యూ చెంగ్ పై 6-4 తేడాతో విజయం సాధించి 1/16 రౌండ్ లోకి ప్రవేశించారు.  అక్కడ దక్షిణ కొరియా ఆటగాడు, లండన్ ఒలింపిక్స్ విజేత జిన్ హెక్ తో జరిగిన హోరాహోరీ పోరులో 6-5 తేడాతో విజయం సాధించి మూడో రౌండ్ మ్యాచ్ (1/8)లోకి అడుగుపెట్టాడు. ఎల్లుండి ఉదయం 7 గంటలకు 1/8 మ్యాచ్ జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్