Monday, June 15, 2026
Homeసినిమారామ్ తో బోయపాటి మూవీ?

రామ్ తో బోయపాటి మూవీ?

Boyapati with Ram: ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ఇటీవ‌ల ‘అఖండ’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ఈ సినిమా త‌ర్వాత బోయ‌పాటి శ్రీను.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకున్నారు. పుష్ప ‘పార్ట్ 1’ త‌ర్వాత ఈ సినిమా పారంభం కావాల్సి ఉంది. ఈ భారీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ నిర్మించాలి అనుకున్నారు. ఆమ‌ధ్య అన్ స్టాప‌బుల్ టాక్ షో ప్రెస్ మీట్ లో కూడా అల్లు అర‌వింద్ బ‌న్నీతో బోయ‌పాటి మూవీని ప్ర‌క‌టించారు.

అయితే… ‘పుష్ప’ పార్ట్ 1 అంచ‌నాల‌కు మించి స‌క్స‌స్ అవ్వ‌డంతో ఇక ఆల‌స్యం చేయ‌కుండా మ‌ధ్య‌లో మ‌రో సినిమా చేయ‌కుండా పుష్ప పార్ట్ 2ను వెంట‌నే సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నాడ‌ట బ‌న్నీ. అంటే… బ‌న్నీతో బోయ‌పాటి సినిమా చేయాలంటే.. దాదాపు సంవ‌త్స‌రం వ‌ర‌కు వెయిట్ చేయాలి. అందుచేత బోయ‌పాటి.. ఇస్మార్ట్ హీరో రామ్ తో సినిమా చేయ‌నున్నార‌ని తెలిసింది. మ‌రి.. ఈ ఊర మాస్ డైరెక్ట‌ర్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ను మాస్ అవ‌తారంలో ఎలా చూపిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular