Friday, April 19, 2024
Homeసినిమాసూర్య‌తో సినిమాపై బోయ‌పాటి క్లారిటీ

సూర్య‌తో సినిమాపై బోయ‌పాటి క్లారిటీ

Surya-Boyapati: త‌మిళ స్టార్ హీరో సూర్య ఎప్ప‌టి నుంచో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నారు. కొన్ని క‌థ‌లు విన‌డం.. ఓకే అన‌డం జ‌రిగింది కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న సెట్ కాలేదు. అయితే.. ఈ మ‌ధ్య సూర్య తెలుగు స్ట్రైయిట్ మూవీ చేయ‌డం ఫిక్స్ అయ్యింద‌ని.. ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్ లోనే ఆ మూవీ ఉంటుంద‌ని టాలీవుడ్ లో గట్టిగా ప్ర‌చారం జ‌రిగింది. ఏమైందో ఏమో కానీ.. మ‌ళ్లీ ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రాలేదు.

బోయ‌పాటి ఇటీవ‌ల ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తో సినిమాని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కోలీవుడ్‌లో స్టార్ హీరో సూర్య, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన మాస్ అండ్ యాక్షన్ డ్రామా ఈటీ. ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్ బ్యానర్‌లో కళానిది మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మార్చి 10వ తేదీన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో రానా దగ్గుబాటి, అగ్ర నిర్మాత సురేష్‌ బాబు, దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ..సూర్య, నేనూ కలిసి తప్పకుండా ఓ సినిమా చేస్తాం. అయితే.. ఎప్పుడు అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేను …కానీ మా కాంబినేషన్‌లో ఖచ్చితంగా ఓ సినిమా ఉంటుంది అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్