Friday, November 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్పీఠం వివాదం మళ్ళీ మొదటికి

పీఠం వివాదం మళ్ళీ మొదటికి

బ్రహ్మంగారి మఠం అధిపతి వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది. గత శనివారం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి చంద్ర శేఖర్ ఆజాద్ బ్రహంగారి వారసుల కుటుంబ సభ్యులతో జరిపిన చర్చల తరువాత మఠాధిపతిగా దివంగత వీరభోగ వెంకటేశ్వర స్వామి మొదటిభార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి, ఉత్తరాధికారిగా రెండవ కుమారుడు వీరభద్రస్వామిలను ఎంపిక చేస్తూ దీనికి రెండో భార్య మహలక్షమ్మ కూడా అంగీకరించినట్లు ప్రకటించారు. ఆమె కుమారుడు గోవింద స్వామిని భవిష్యత్తులో మఠం అధిపతిగా నియమిస్తామని హామీ ఇచ్చారు.

అయితే తనపై ఒత్తిడి తెచ్చి ఆ ప్రతిపాదనకు అంగీకరించేలా చేశారని రెండో భార్య మహా లక్షమ్మ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.  మఠాధిపతిగా వెంకటాద్రి నియామకాన్ని నిలిపివేయాలంటూ ఆమె కోర్టును అభ్యర్ధించారు. స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయశాఖ అధికారులు వీలునామా ప్రకారం కాకుండా చర్చలు జరిపి ఈ నియామకం ప్రకటించారని,  ఇది చెల్లదని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్