Friday, April 19, 2024
Homeసినిమాచెడ్డి గ్యాంగ్ తమాషా ట్రైలర్ రిలీజ్ చేసిన బ్రహ్మానందం

చెడ్డి గ్యాంగ్ తమాషా ట్రైలర్ రిలీజ్ చేసిన బ్రహ్మానందం

అబుజా ఎంటర్టైన్మెంట్స్, శ్రీలీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాణ సారధ్యంలో, వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్ తమాషా’. గాయత్రి పటేల్ హీరోయిన్. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన హాస్యబ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం ట్రైలర్ విడుదల చేశారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ “చిత్ర దర్శకుడు వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా హీరోగా ఈ చెడ్డి గ్యాంగ్ తో ఎంతో కష్టపడి అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఒక సినిమాని తియ్యడానికి నానా ఇబ్బంది పడుతున్న ఈటైం లో ఇతను ఈ చెడ్డి గ్యాంగ్ తీశాడు. ట్రైలర్ చాలా సహజంగా ఉంది. మాస్టర్ జి లాంటి వారితో పాటలు రాయించుకుని ఈ కుర్రాళ్లు అందరూ చేస్తున్న ఈ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. సినిమా బాగుంటే అదే సక్సెస్ అవుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. అందరూ సినిమాకి ఎంతో కష్ట పడి కృషి చేస్తారు. అది చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ అని కాకుండా వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ను మనం మెచ్చుకోవాలి అభినందించాలి.

చెడ్డీ గ్యాంగ్ తమాషా అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసాను. అందుకని ఒక హాస్య నటుడిగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి వచ్చాను. హాస్య నటులు తీసే సినిమాలు అన్ని సక్సెస్ కావాలి అని హాస్యం బయటకు రావాలి అని మా గురువు గారు జంధ్యాల గారు బతికి వున్నప్పుడు చెబుతూ వుంటారు. హాస్యాన్ని మనం బతికించాలి అని ఈ ఫంక్షన్ కి నేను రావడం జరిగింది. కాబట్టి హాస్యాన్ని బతికించండి. మాతృదేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్యదేవొభవ.. అతిధి దేవొభవ అది కాకుండా హాస్య నట దేవో భవ థాంక్ యు” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్