Saturday, March 7, 2026
HomeTrending Newsబిహార్ లో వరుసగా కూలుతున్న వంతెనలు

బిహార్ లో వరుసగా కూలుతున్న వంతెనలు

బీహార్‌ రాష్ట్రంలో ఆరు నెలల్లోనే మూడు వంతెనలు కుప్పకూలాయి. వరుసగా వంతెనలు కూలిపోతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సివాన్‌లోని దారుండా బ్లాక్‌ రామ్‌గర్హాలో గండక్‌ కాలువపై నిర్మించిన వంతెన కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదు. రెండు రోజుల క్రితం అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. ఆ ఘటన మరవకముందే తాజాగా మరో వంతెన కూలిపోయింది.

రూ.12 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ వంతెన అప్రోచ్‌ రోడ్ల నిర్మాణాన్ని ఇంకా చేపట్టలేదు. దీంతో వంతెనపై ప్రజా రవాణాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. బక్రా నదిపై కుర్సా కంటా, స్కిటీ ప్రాంతాలను కలుపుతూ ఆ బ్రిడ్జి నిర్మించారు. బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

వారం వ్యవధిలోనే వరుసగా రెండు వంతెనలు కూలిపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ-జేడీయూ కూటమి పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని ఆరోపిస్తున్నాయి. ఈ సంవత్సరంలోనే మార్చి నెలలో కోసి నదిపై నిర్మిస్తున్న వంతెన కూలి పది మంది గాయపడ్డారు.

ఆరు నెలల వ్యవధిలోనే మూడు వంతెనలు కూలిపోవటంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిఎం నితీష్ కుమార్ అధికారం నిలబెట్టుకునేందుకే ఆసక్తి చూపుతున్నారని… ప్రజా సంక్షేమం పట్టించుకోవటం లేదని రాష్ట్రీయ జనతదల్ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు.

-దేశవేని భాస్కర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular