Brindakarat Criticized Kcr For Speaking Out Against The Bjp After Its Defeat In Huzurabad :
పోడు భూముల విషయంలో ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే విడుదల చేసినటువంటి జీవోలో తక్షణమే మార్పులు చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ డిమాండ్ చేశారు. ఇది రైతులకు నష్టదాయకమైన జీవో అన్నారు. ఏజెన్సీ చట్టాలకు చట్టబద్ధమైన హక్కును నిరాకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. భద్రాచలంలో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్తుపావిష్కరణ కార్యక్రమంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్కులర్ పేరుతో రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ వ్యవహరిస్తోందని,వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి, లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాక రైతులను వరి పంట వేయవద్దని ఎలా చెబుతారని బృందకారత్ ప్రశ్నించారు. ప్రాజెక్టులు వచ్చిన తర్వాత రైతులు ప్రధానంగా వరి పంట సాగు చేస్తారని, ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసింది రైతుల భవిష్యత్తు కోసమా కాంట్రాక్టర్ల లాభాల కోసమా అని అడిగారు. బిజెపి విధానాలను వ్యతిరేకించక పోగా బీజేపీ విధానాలకు తెలంగాణ రైతులను బలి ఇవ్వడానికి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.
హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిపోగానే బిజెపికి వ్యతిరేకంగా కెసిఆర్ మాట్లాడుతున్నారని, ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు. బీజేపీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం నిలకడగా నిబద్ధతగా ప్రత్యామ్నాయ విధానాలతో పోరాటం చేస్తే మేము తప్పకుండా సహకరిస్తామని బృందకారత్ పేర్కొన్నారు.
ALSO READ : సొల్లు బీజేపీ మాటలు రైతులు నమ్మొద్దు