పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి యూరోప్ దేశాలకు వలసలు పెరిగాయి. మొరాకో, ట్యునిసియా దేశాల ద్వారా యూరోప్ కు వచ్చే క్రమంలో వేలమంది మధ్యదార సముద్రంలో చనిపోతున్నారు. ప్రాణాలతో వచ్చిన వారు జైళ్లలో మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు అక్రమంగా వలస వస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కొత్త బిల్లు తెచ్చారు. వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో వారిని శరణార్థులుగా పరిగణించమని ఆయన తెలిపారు. ఇల్లీగల్ మైగ్రేంట్ బిల్లుతో ఇక నుంచి శరణార్థుల అక్రమ వలసలకు అడ్డుకట్ట పడుతుందని వెల్లడించారు.
Britain : వలసదారుల అడ్డుకట్టకు బ్రిటన్ కొత్త బిల్లు
‘మీరు కనుక మా దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే ఇక నుంచి మిమ్మల్ని శరణార్థులుగా పరిగణించం, మీకు గతంలోలాగా బానిసత్వ రక్షణ ప్రయోజనాలు లభించవు. అలాగే మీరు నకిలీ మానవ హక్కుల దావాలు వేసుకోలేరు. అసలు మీరు ఇక్కడ ఉండలేరు’ అని పేర్కొన్నారు. ఈ కొత్త బిల్లును హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.