Sunday, January 19, 2025
HomeTrending Newsబ్రిటన్‌ కొత్త ప్రధానిగా లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌ కొత్త ప్రధానిగా లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌ ప్రధాని ఎంపికలో ఉత్కంఠకు తెరపడింది. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారో తేలిపోయింది. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ విజయం సాధించారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌కు మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమెకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలన్నీ ఘంటా పథంగా చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

సర్వేలు చెప్పినట్టుగానే మార్గరెట్‌ థాచర్‌, థెరిసా మే తర్వాత బ్రిటన్‌ పగ్గాలు చేపట్టిన మూడో మహిళా ప్రధానిగా లిజ్‌ రికార్డు సృష్టించారు. కన్జర్వేటివ్‌ పార్టీ నేతను ఎన్నుకొనేందుకు గడిచిన ఆరు వారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారంతో పాటు పార్టీలో అంతర్గతంగా పోలింగ్‌ జరిగ్గా.. తాజాగా తుది ఫలితాలు వెల్లడయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్