Sunday, February 23, 2025
HomeTrending Newsబోరిస్ జాన్సన్ రాజీనామా

బోరిస్ జాన్సన్ రాజీనామా

At last:  బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. నిన్న ఇద్దరు మంత్రుల రాజీనామాతో మొదలైన ఈ సంక్షోభం నేడు స్వయంగా ప్రధాని వైదొలగడంతో ముగిసింది.  బోరిస్ నాయకత్వంపై   విశ్వాసం లేదంటూ బుధవారం నాడు బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ లు  తమ పదవులకు గుడ్ బై చెప్పగా, నిన్న మరో 15మంది మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు ప్రభుత్వంలో ఉన్నతాధికారులు, దౌత్యాధికారులు కూడా ఇదే దారిలో నడవడంతో సంక్షోభం ముదిరి పాకాన  పడింది. మరోవైపు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి బోరిస్ కు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బ్రిటన్ ఎదుర్కొంటున్న పలు సవాళ్లు, ఆర్ధిక మాంద్యంతో దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని ఈ పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తే లేదని బోరిస్ భీష్మించారు. సమస్యలనుంచి తప్పించుకుపోలేనని స్పష్టం చేశారు. రాజీనామా చేసిన ఇద్దరు మంత్రుల స్థానంలో కొత్తమంత్రులను నియమించారు కూడా. ఇది ఇలా కొనసాగుతుండగానే మరికొందరు మంత్రుల రాజీనామాతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజీనామా చేస్తోన్న మంత్రులు, అధికారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం…. ప్రజల ఆందోళనలతో  బోరిస్  జాన్సన్ దిగి వచ్చి పదవికి రాజీనామా చేశారు.

అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ, సత్ప్రవర్తన లేని క్రిస్ పించర్ ను డిప్యూటీ చీఫ్ విప్ గా నియమించడం… కోవిడ్ సమయంలో ప్రధాని అధికారిక నివాసంలో మద్యం విందులో పాల్గొనడం జాన్సన్ రాజీనామాకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

Also Read :

లండన్ ప్రిస్టేజ్ ఈజ్ ఫాలింగ్ డౌన్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్