Saturday, January 18, 2025
HomeTrending Newsసెప్టెంబర్ 5న బ్రిటన్ కొత్త ప్రధాని ఎన్నిక

సెప్టెంబర్ 5న బ్రిటన్ కొత్త ప్రధాని ఎన్నిక

బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి ఎన్నిక సెప్టెంబర్ 5వ తేదిన ఉంటుందని కన్జర్వేటివ్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు పార్టీ నేత గ్రాహం బ్రాడి ప్రకటన విడుదల చేశారు. పలు దఫాలలో జరిగే ప్రధానమంత్రి ఎన్నిక సెప్టెంబర్ 5వ తేదిన కొలిక్కి వస్తుందని వెల్లడించారు. ప్రధాని పదవి కోసం పది మంది నేతలు పోటీ పడుతున్నారు. అందులో ప్రధానంగా  పెన్నీ మార్దంట్, లిజ్ ట్రస్, రిషి సనక్, సాజిద్ జావిద్ ల మధ్యే పోటీ నెలకొంది.

బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయాలని స్వంత(కన్జర్వేటివ్‌ పార్టీ) పార్టీ నేతలే నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. బోరిస్‌పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ పలువురు మంత్రులు.. తమ పదవులకు స్వస్తి పలికారు. దీంతో బోరిస్‌ ప్రధాన పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడి ఎన్నిక మరోసారి తప్పనిసరయింది. కన్వర్జేటివ్‌ పార్టీలో ప్రధాని ఎన్నిక ప్రక్రియ ఎలా సాగుతుందంటే..?
ఎన్నిక ప్రకియ ఎలా ఉంటుందంటే.?
ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు కన్జర్వేటివ్‌ ఎంపిల్లో ఎవరైనా  పోటీ పడొచ్చు.. పార్టీ నాయకుడి (వారే ప్రధాని)  పదవికి ఎంతమంది ఎంపిలైనా పోటీ చేయోచ్చు. అందుకు ఇద్దరు కన్జర్వేటివ్‌ సభ్యులు నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఎంపిలు పోటీలో నిలిస్తే.. వారి సంఖ్యను కుదించేందుకు పలు రౌండ్ల ఎన్నిక జరుగుతుంది. సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించే ఈ ఎన్నికలో తమకు ఇష్టమైన అభ్యర్థికి ఎంపిలు ఓటు వేయోచ్చు. స్వల్ప ఓట్లు వచ్చిన వ్యక్తి పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు మాత్రమే పోటీలో మిగిలేంత వరకూ ఎన్నిక జరుగుతూనే ఉంటుంది. మిగిలిన ఇద్దరిలో ఒకరిని మాత్రమే తమ నాయకుడిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్టీ నాయకుడిని ఎన్నుకునేందుకు విస్తృత స్థాయిలో ఉండే కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ మద్దతును తెలియజేస్తారు. వీరిలో గెలుపొందిన వ్యక్తిని కొత్త నాయకుడిగా ప్రకటిస్తారు. పార్లమెంటులో మెజారిటీ కలిగిన పార్టీ తరపు అభ్యర్థే కొత్త ప్రధానిగా నియమితులవుతారు. అలా ఎన్నికైన వ్యక్తి వెంటనే మళ్లీ ఎన్నికలకు పిలుపునివ్వకూడదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్