పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలసి నటించిన చిత్రం బ్రో. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. మేకర్స్ ఎంత హడావిడి చేసినా కామన్ ఆడియన్స్ ఇది రీమేక్ మూవీ వలనో ఏమో కానీ.. అంతగా ఆసక్తి చూపించలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్ సీస్ లో కూడా ఇదే పరిస్థితి. ఓవర్ సీస్ లోని ప్రీమియర్ షోస్ ద్వారా ఇది క్లియర్ గా అర్థమైంది.
ప్రీమియర్స్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలబడుతుందనుకున్న బ్రో సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఆదిపురుష్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన చిత్రం ఆదిపురుష్. ఈ ఏడాది యూఎస్ టాప్-5 ప్రీమియర్స్ లో ప్రభాస్ సినిమాదే అగ్రస్థానం. ఈ సినిమా ప్రీమియర్స్ తోనే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ఆదిపురుష్ తర్వాత, ఈ ఏడాది ప్రీమియర్స్ లో 7 లక్షల డాలర్లకు పైగా వసూళ్లతో బాలయ్య వీరసింహారెడ్డి రెండో స్థానంలో నిలిచింది. అదే టైమ్ లో రిలీజైన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా 6 లక్షల డాలర్లకు పైగా వసూళ్లతో మూడో స్థానంలో నిలిచింది.
ఇక పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా టాప్-5 ప్రీమియర్స్ లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో నాని నటించిన దసరా సినిమా ఉంది. బ్రో సినిమా, ప్రీమియర్స్ లో చిరంజీవి, బాలయ్య మూవీస్ ను కూడా క్రాస్ చేయలేకపోయింది. యూఎస్ఏలో టాప్-5 ప్రీమియర్స్ జాబితా చూసినట్లైతే.. ఆదిపురుష్ – $1,195,316, వీరసింహారెడ్డి – – $708,472, వాల్తేరు వీరయ్య – $679,036, బ్రో – $647,227, దసరా – $637,677. ఇప్పుడు టాక్ అంత గొప్పగా రాలేదు. జస్ట్ యావరేజ్ అనేంతగా టాక్ వచ్చింది. అందుచేత ఇక నుంచి ఏమాత్రం కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది.