Thursday, May 30, 2024
Homeసినిమాతారక్ గురించి జపాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

తారక్ గురించి జపాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్, రామ్ చరణ్‌, రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్  1200 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.  ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ గెలుచుకుని చరిత్ర తిరగరాసింది. . దీంతో ఒక్కసారిగా ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ దృష్టి పడింది. ఎన్టీఆర్, చరణ్‌ పాన్ ఇండియా స్టార్స్ కాస్త పాన్ వరల్డ్ స్టార్స్ అయ్యారు. ఈ సినిమాని జపాన్ లో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా  ఈ మూవీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ ప్రపంచ స్థాయికి చేరుకుంది. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రేక్షకులు వీక్షించారు.  ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆర్ఆర్ఆర్ సినిమా డిజిటల్ మీడియాలో చూశారు.  ఇదిలా ఉంటే.. జపాన్ లో అత్యధిక వసూలు సాధించిన ఇండియన్ మూవీగా ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచింది. ఈ సినిమాలోని చరణ్, తారక్ క్యారెక్టర్లకు జపాన్ సినీ ప్రేమికులు బాగా కనెక్ట్ అయిపోయారు. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ఇండియా, జపాన్ సమ్మిట్ లో ఆ దేశ విదేశాంగ మంత్రి యోషిమాష హయూషి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తాను ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని.. ఆ సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేసానని, మూవీలో రామారావు జూనియర్ కి తను ఫ్యాన్ అయిపోయాను అని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దానిని మరింతగా షేర్ చేస్తూ ఉన్నారు. తమ అభిమాన హీరో గొప్పతనం గురించి కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ హాలీవుడ్ స్థాయికి రీచ్ అవ్వడం ఖాయమని అంటున్నారు సినీ జనాలు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్