Saturday, July 27, 2024
Homeసినిమా'బ్రో' నుండి రెండవ పాట 'జాణవులే' విడుదల

‘బ్రో’ నుండి రెండవ పాట ‘జాణవులే’ విడుదల

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు, టీజర్‌, మొదటి పాట ‘మై డియర్ మార్కండేయ’కు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈరోజు ‘బ్రో’ నుండి రెండవ పాట ‘జాణవులే’ విడుదలైంది. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. స్వరకర్త స్వయంగా కె ప్రణతితో కలిసి ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.‘జాణవులే’ పాట విడుదల కార్యక్రమం తిరుపతిలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్, సముద్రఖని, ప్రముఖ నిర్మాత ఎన్.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అభిమానుల కేరింతల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా సాగిన ఈ వేడుకలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “మా గురువు, మేనమామ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రేమ, ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మీ ప్రేమ, అభిమానం నాపై ఎప్పుడూ ఇలాగే కురిపించాలని కోరుకుంటున్నాను. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జూలై 28 న థియేటర్లలో గోల చేయడానికి సిద్ధంగా ఉండండి” అన్నారు.

సముద్రఖని మాట్లాడుతూ.. “నా బ్రో సాయి ధరమ్ తేజ్ తో కలిసి పని చేయడం ప్రతిరోజూ పండగలా ఉంటుంది. బిగ్ బ్రో కళ్యాణ్ గారికి థాంక్స్ చెబుతూనే ఉంటాను. సినిమాలో ఆయన దేవుడిలా దిగి వస్తారు. త్రివిక్రమ్ అన్నయ్యకి, నిర్మాతలు విశ్వప్రసాద్ గారు, వివేక్ గారికి ధన్యవాదాలు. జీవితంలో మరిచిపోలేని సినిమా ఇది. మీతో కలిసి ఈ సినిమా చూడటం కోసం జూలై 28 కోసం ఎదురుచూస్తున్నాను” అన్నారు.

“జాణవులే నెరజాణవులే.. నా జాన్ నువ్వులే జాణవులే.. వాణివిలే అలివేణివిలే.. నా మూన్ నువ్వులే జాణవులే” అంటూ కథానాయకుడు తన ప్రేయసిపై తనకున్న ఇష్టాన్ని తెలుపుతున్న అందమైన పంక్తులతో పాట ప్రారంభమైంది. ఆంగ్ల పంక్తులతో కూడిన అర్థవంతమైన తెలుగు సాహిత్యం పాటకు సరికొత్త రూపాన్ని ఇస్తూ, అన్ని వర్గాల వారికి చేరువయ్యేలా ఉంది.  “నా ఎదల కథను మొదలు పెడితె ముందుమాట నీదే.. నీ కవల కలువ కనులు పలికె భాష చెప్పరాదే” వంటి పంక్తులతో పాట ఎంతో అందంగా సాగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్