Thursday, June 18, 2026
Homeసినిమాపవన్, తేజ్ బ్రో టీజర్ వచ్చేది ఎప్పుడు..?

పవన్, తేజ్ బ్రో టీజర్ వచ్చేది ఎప్పుడు..?

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రో‘. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించారు. ఈ సినిమాకి సంబంధించిన పవన్, తేజ్ మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి బ్రో మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఇది తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతమ్ చిత్రానికి రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఆమధ్య బ్రో పవన్ మోషన్ పోస్టర్, తేజ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాయి. ఆతర్వాత నుంచి బ్రో నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అవ్వడంతో బ్రో ప్రమోషన్స్ కి బ్రేక్ పడింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఇప్పుడు బ్రో టీజర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. వచ్చే వారంలో బ్రో టీజర్ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, తనికెళ్ళ భరణి, రాజా చెంబోలు, రోహిణి, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. మెగా అభిమానుల్లోనే కాకుండా సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి కలిగిస్తున్న బ్రో మూవీని జులై 28న విడుదల చేయడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular