Sunday, January 19, 2025
HomeTrending News6 రాష్ట్రాల్లో భారత రాష్ట్ర కిసాన్ సమితి

6 రాష్ట్రాల్లో భారత రాష్ట్ర కిసాన్ సమితి

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్ ) పార్టీ కార్యకలాపాలు, డిసెంబర్ నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నాయి. పార్టీ పేరును మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటీవల అధికారికంగా సమాచారం వచ్చిన వెంటనే అధినేత కేసీఆర్ కార్యక్రమాలను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ ను అధికారికంగా ప్రకటించి వెంటనే ఢిల్లీ పర్యటన చేపట్టారు. వీలయినంత త్వరలో ఢిల్లీలో జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ముందుకు సాగారు.

అత్యంత ప్రాముఖ్యతనివ్వాల్సిన వ్యవసాయం సాగునీటి రంగాన్ని దశాబ్దాలుగా దేశ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనను అధినేత కెసిఆర్ పలు మార్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా ముందస్తుగా 6 రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తులు పూర్తి చేసుకుని క్రిస్మస్ పండగ అనంతరం ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అటు ఉత్తర భారతం, ఇటు తూర్పు, మధ్య భారతాలకు చెందిన పలు రాష్ట్రాలనుంచి అనేకమంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నాయకులు, తమ టీం లతో, అనుచరులతో వచ్చి స్వయంగా అధినేత కేసీఆర్ తో సంప్రదింపులు జరిపుతున్నారు. ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక సామాజిక సాంస్క్రతిక పరిస్తితులు నేపథ్యాలను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎటువంటి విధానాలను అవలంభించాల్నో వారికి సుధీర్ఘంగా అధినేత కేసీఆర్ వివరించి వారిని ఆ దిశగా సమాయత్తం చేసి పంపుతున్నారు. ఈ నెలాఖరుకల్లా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, సహా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బిఆర్ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించనున్నారు.

కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి తమకు అవకాశం కల్పించాలని ఇప్పటికే ఢిల్లీలో ఇటు హైద్రాబాద్ లో అధినేత కేసీఆర్ తో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు చర్చలు సంప్రదింపులు జరుపుతున్నారు. తాము బిఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటామని అధినేత కెసిఆర్ తో కలిసి పనిచేస్తామని ఉత్సాహంగా వున్నారు. ఈ మేరకు ఆంధ్రాలోని పలు జిల్లాల్లో బిఆర్ కె ఎస్ ను ప్రారంభించడానికి రంగం సిద్దమైంది. ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాలనుంచి పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఢబ్భై ఎనభై మంది ప్రముఖులు కేసీఆర్ తో సంప్రదించి వెల్లి తమ క్రేత్రస్థాయిలో సంసిద్దం అవుతున్నారు. అధినేత ప్రకటన అనంతరం ఆంధ్రాలో ‘ బిఆర్ కె ఎస్ (బిఆర్ఎస్ కిసాన్ సెల్) ’ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అదే సందర్భంలో కార్లు, బస్సులు పలు వాహనాల్లో తరలివచ్చి బిఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటామని ఉత్సాహం చూపుతున్నారు. అందే సందర్భంలో మహారాష్ట్ర, ఒడిస్సా, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా పలువురు ఉత్సాహం చూపుతున్నారు.

ఇప్పటికే కన్నడ, ఒరియా, మరాఠా,వంటి పలు భారతీయ భాషలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, బిఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే కార్యాచరణ గురించి భావజాల వ్యాప్తి కోసం సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో అవి కార్యరూపం దాల్చడానికి రంగం సిద్దమైంది.

క్రిస్మస్ పండుగ తర్వాత నుంచి బిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల ఉదృతి పెరగనున్నది. ఈ మేరకు ముందస్తుగా 6 రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ కే కార్యకలాపాలను ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ వేదికగా జాతీయ మీడియాతో కెసిఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు, వార్తా సంస్థల జర్నలిస్టులతో బిఆర్ఎస్ అధినేత సమావేశం కానున్నారు. డిసెంబర్ నెలాఖరు లో ఢిల్లీ లో నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసి బిఆర్ఎస్ పార్టీ సిద్దాంతాలు భవిష్యత్తు కార్యాచరణ సహా విధి విధానాలను ప్రకటించనున్నారు.

Also Read : బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్