Tuesday, June 16, 2026
HomeTrending NewsChimalapadu:చీమలపాడులో విషాదం..సిఎం దిగ్భ్రాంతి

Chimalapadu:చీమలపాడులో విషాదం..సిఎం దిగ్భ్రాంతి

ఖమ్మం జిల్లా.. కారేపల్లి మండలం చీమలపాడులో విషాదం..టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బాణాసంచా పేల్చిన నాయకులు..బాణాసంచా పడడంతో గుడిసెకు అంటుకున్న నిప్పు..గుడిసెలోని గ్యాస్ సిలిండర్ పేలడంతో స్పాట్లో ఒకరి మృతి.. మరో నలుగురికి తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బిఆర్ఎస్ అధినేత సిఎం కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వూహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కి, ప్రమాదం జరిగిన ప్రాంతంలో వున్న ఎంపీ నామా నాగేశ్వర్ రావులకు ఫోన్లు చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సిఎం భరోసా ఇచ్చారు. తాము అండగా వుంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular