చంద్రబాబు నిన్న ఖమ్మం లో చేసిన షో కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టు ఉందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. చచ్చిన బఱ్ఱె కుండెడు పాలు ఇచ్చినట్లుంది చంద్రబాబు తీరు అన్నారు. మంత్రులు టి. హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్,వి. శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్,విప్ ఎం.ఎస్. ప్రభాకర్ రావు హైదరాబాద్ టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఈ రోజు ప్రెస్ మీట్  నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… ఖమ్మం సభలో చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు.

మంత్రి టి. హరీష్ రావు కామెంట్స్…
ap ని అప్పుల పాలు చేసి ఓటర్ల ఛీత్కారానికి గురైంది చంద్రబాబు కాదా. తెలంగాణను అత్యంత వెనకబడేలా చేసింది చంద్రబాబు కాదా. చంద్రబాబు పట్ల తెలంగాణ ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. సూర్యుడు ఉదయిస్తోంది తన వల్లే, కోడి కూస్తోంది తన వల్లే అని అనే బాపతు చంద్రబాబు. చంద్రబాబులా మాట్లాడితే తమ దేశంలో నైతే జైలుకు పంపుతారని అప్పటి స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అన్నారు. రైతులను నిండా ముంచింది చంద్రబాబు కాదా. కరెంటు చార్జీలు తగ్గించమంటే బషీర్ బాగ్ లో రైతులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణను ఎండబెట్టింది చంద్రబాబు. వ్యవసాయం దండగ అన్నది బాబు కాదా. 2004 లో తమ ఓటమికి రైతులను నిర్లక్ష్యం చేయడమే కారణమని బాబు అన్నారు మరచిపోయారా. apలో చెల్లని రూపాయి చంద్రబాబు తెలంగాణలో చెల్లుతుందా. ap లో బీజేపీతో టీడీపీ పొత్తు కోసమే తెలంగాణలో చంద్రబాబు డ్రామాలు. కరోనాకు వాక్సిన్ కని పెట్టింది తానే అన్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అన్న సంగతి మరో మారు రుజువైంది. రైతులకు కల్లాలు కట్టడం తప్పు అని కేంద్రం అంటోంది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కల్లాలు కడితే 150 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలని కేంద్రం హుకుం జారీ చేసింది. రైతులు వడ్లు ఆరబోసుకునేందుకు కల్లాలు కడితే ఎలా తప్పు. చేపలు ఆరబోసుకునేందుకు కొన్ని రాష్ట్రాల్లో కల్లాలకు అనుమతిఛ్చి వడ్ల కల్లాలకు ఇవ్వరా. తెలంగాణ రైతుల పట్ల కేంద్రానికి ఎందుకు క్షక్ష ,కోపం ,వివక్ష…? కల్లాలపై కేంద్రం వైఖరి కి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ధర్నాలకు బీ ఆర్ ఎస్ పిలుపు నిచ్చింది.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కామెంట్స్

ఖమ్మం జిల్లాకు తెలంగాణకు చంద్రబాబు వల్లే మొదటి నష్టం అన్యాయం జరిగింది. పోలవరానికి ఏడు మండలాలు గుంజుకున్నది చంద్రబాబు కాదా. 440 మెగావాట్ల సీలేరు జల విద్యుత్ కేంద్రం ap కి దక్కించుకుంది చంద్రబాబు కాదా. ఖమ్మంలో ఒక్క సాగు నీటి ప్రాజెక్ట్ కట్టాను అని చంద్రబాబు నిరూపిస్తే నేను ముక్కు నేల కు రాస్తా. కేసీఆర్ వల్లే ఖమ్మం కు జల వైభవం వచ్చింది. ఖమ్మంకు ఐటీ తెచ్చింది కేసీఆర్, ktr లే.  చంద్రబాబు హాయంలో ఖమ్మం కు బుడ్డ పైసా పని కాలేదు. గోదావరి కరకట్ట చంద్రబాబు పూర్తి చేసుంటే మొన్న భద్రాచలంలో వరదలు వచ్చేవా. చంద్రబాబు సభ పెట్టిన గ్రౌండ్ చాలా చిన్నది. ap నుంచి జనాలను తరలించారు

మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చంద్రబాబు పర్యటనపై మండిపడ్డారు.

నాడు తెలంగాణ పదాన్ని నిషేధించిన వ్యక్తి చంద్రబాబు. .చంద్రబాబు నాడు ఉద్యోగులను రాచి రాంపాన పెట్టాడు. నిరుద్యోగుల పొట్ట కొట్టింది చంద్రబాబే. పాలమూరు పేరు చెప్పుకుని ప్రపంచబ్యాంకు నుంచి రుణం తెచ్చిన వ్యక్తి చంద్రబాబు. తెలంగాణ వాదాన్ని అణచి వేసింది బాబు కాదా. అంగన్ వాడీ వర్కర్ల ను గుర్రాలతో తొక్కించింది బాబు కాదా. బాబు నిన్న కూడా జై తెలంగాణ అనలేదు. బాబును చూస్తే పంచతంత్రలోని పులి బాటసారి బంగారు కడియం కథ గుర్తొస్తోంది. కేసీఆర్ ను ఎదుర్కునేందుకు బీజేపీ రకరకాల ప్రయోగాలు చేస్తోంది ..ఇపుడు బీజేపీ పంపుతున్న నేతల జాబితా లో చంద్రబాబు చేరిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *