Wednesday, June 17, 2026
HomeTrending NewsSangareddy: బీజేపీ ఇచ్చింది లేదు.. కాంగ్రెస్ చేసింది లేదు - మంత్రి హ‌రీశ్‌

Sangareddy: బీజేపీ ఇచ్చింది లేదు.. కాంగ్రెస్ చేసింది లేదు – మంత్రి హ‌రీశ్‌

తెలంగాణ‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇచ్చింది లేదు.. కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు అని రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. ప‌టాన్‌చెరులో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్, ఫ్రీడం పార్కుల‌ను మంత్రి హ‌రీశ్ రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు ఉన్నాయా..? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. రిజెక్టెడ్ లీడ‌ర్లు, స్క్రాప్ లీడర్లు జాయిన్ అయితే పోయేది లేదు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా, హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ మాత్ర‌మేన‌ని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్య‌మ‌న్నారు.

కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇవ్వకుండా, అసలు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేసింది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. దక్షిణ భారత దేశం అభివృద్ధిలో బీజేపీకి చిన్నచూపు ఎందుకు అని అడిగారు. బీజేపీ ద‌క్షిణాది రాష్ట్రాలకు ఏమైనా ఇచ్చిందా అంటే అది కేవలం శుష్కప్రియాలు, శూన్య హస్తాలు మాత్రమే అని విమ‌ర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంద‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular