భారతదేశ భవిష్యత్తును మార్చేందుకు, భారతదేశ ఆలోచనను, భావజాలాన్ని మార్చేందుకు ఒక సంకల్పంతో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిందని బిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ప్రస్థానంలో, మహా యుద్ధంలో భాగస్వాములయ్యేందుకు ఎంతో దూరమైన ఒడిషా నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు స్వాగతం అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఒడిషా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తో పాటు ఇతర ప్రముఖ నేతలు బిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో శుక్రవారం పార్టీలో  చేరారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు:

ఒడిషా మాజీ ముఖ్యమంత్రి, అగ్రనేత, రాజకీయ భీష్మాచార్యుడు గిరిదర్ గమాంగ్ వారి శ్రీమతి హేమ గమాంగ్ , వారి కుమారులు శిశిర్ గమాంగ్ తదితర నాయకులందరినీ స్వాగతిస్తూ, అభినందిస్తున్నాను.
అక్షయ్ కుమార్ గాంధీజీ బాటలో నడుస్తున్న గొప్ప వ్యక్తి, ఉద్యమకారుడు. రైతుల కోసం ఉద్యమాలు చేపట్టిన వీరి వెన్నంటి నడుస్తున్న ఎంతోమంది నేడు బిఆర్ఎస్ లో చేరుతున్నారు. మీ అందరికీ పేరు పేరునా స్వాగతం పలుకుతున్నాను
• ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా గా పనిచేసాను. ముఖ్యమంత్రిగా పని చేస్తున్నాను.
• ఎన్నో విషయాలను చూసిన వ్యక్తిగా, అధ్యయనం చేసిన వ్యక్తిగా, చాలా పెద్ద బాధ్యతతో నేను ఈ విషయాలను చెప్తున్నాను.
• ఈ రోజు ప్రపంచంలో అమెరికా ఎక్కడుంది ?, చైనా ఎక్కడుంది ?, భారతదేశం ఎక్కడుంది?
• భారతదేశ యువత అమెరికా వెళ్ళడానికి ఎందుకు తాపత్రయ పడుతున్నారు ? ఎందుకు ఉవ్విళ్ళూరుతున్నారు ?
• అమెరికా వెళ్ళిన భారతీయులకు అక్కడ గ్రీన్ కార్డు లభిస్తే, అది గౌరవంగా భావించి వారి తల్లిదండ్రులు ఇక్కడ బంధుమిత్రులను పిలుచుకొని దావత్ లు ఎందుకు చేసుకుంటున్నారు. ఇది దేనికి సంకేతం ? దీన్ని అర్థం చేసుకుంటే మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది ?
• ఎంతో సంపద ఉన్న మన దేశంలో ప్రజలు ఎందుకు వంచించబడుతున్నారు ?
• 75 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలకు త్రాగడానికి తగినన్ని నీళ్ళు లేవు.
• వ్యవసాయరంగానికి, రైతులకు చాలినంత సాగునీటిని కూడా అందించలేకపోతున్నారు. విద్యుత్ సౌకర్యాన్ని కూడా కల్పించలేకపోతున్నారు. ఇవేం దుర్భర పరిస్థితులు ?
• ఎన్నో ప్రభుత్వాలను చూసినం. ఎందరో నాయకులను చూసినం. ఎన్నో రంగు రంగుల జెండాలను చూసినం. కానీ రైతులు, పేదల పరిస్థితి మాత్రమ మారలేదు. దీనికి కారణం ఏమిటి ?
• ఎన్నికల్లో పార్టీలు గెలుస్తున్నాయి. నాయకులు గెలుస్తున్నారు. కానీ ఎన్నికల తర్వాత ప్రజలు ఓడిపోతున్నారు
• భారతదేశ రాజకీయాల్లో గంభీరమైన మార్పులు రావాల్సి ఉంది. ఎన్నికల్లో పార్టీలు, నాయకులు కాదు ప్రజలు గెలవాలి.
• ఎన్నికల తర్వాత ప్రజలు గెలవాలి. అదే ప్రజాస్వామ్యం గెలుపు. దాని పేరు అసలైన ప్రజాస్వామ్యం.
• రాజకీయ కుట్రదారులు అధికారమే పరమావధిగా ఎన్నో నినాదాలిచ్చారు. ఎన్నో హామీలిచ్చారు. తర్వాత ఏం జరిగిందో ప్రజలకు తెలుసు.
• నేడు మన భారతదేశ లక్ష్యం ఏమిటి ? మన దేశం లక్ష్యం కోల్పోయింది. దారి తప్పింది.
• ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పరిణమించింది.
• ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతి పేరు మీద, మతం పేరు మీద ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. ప్రజలను విభజిస్తున్నారు.
• ప్రజా సేవ, దేశాభివృద్ధే లక్ష్యంగా పార్టీలు రావాలి. ఎన్నికల్లో గెలుపు అందుకున్న పార్టీలు ఆ దిశగా పాటుపడాలి. కానీ నేడు ఏం జరుగుతున్నది ?
• ఒడిషా లోని మహానదిలో మన అవసరాలకు మించి నీటి లభ్యత ఉంది. కానీ మనం 25-30 శాతం మాత్రమే వినియోగించుకుంటున్నాం. మిగతా నీరు అంతా సముద్రంలో కలుస్తున్నది. మహానదితో పాటు బ్రాహ్మణి, వైతరణి నదులు కూడా ప్రవహిస్తున్నాయి. కానీ తాగడానికి నీరు లేదు. ఈ నీరంతా ఎక్కడికి పోతున్నది ? ఈ నీళ్ళు తాగునీటిగా మన ఇండ్లలోకి నల్లాల ద్వారా ఎందుకు రావడం లేదు ?
• ఈ 75 సంవత్సరాలుగా మీరు భారీ ప్రసంగాలు ఇచ్చారు కానీ తాగడానికి నీరు ఇవ్వలేదు
• తాగడానికి నీరు ఉండదు. కరెంటు ఉండదు. కానీ ప్రసంగాలు మాత్రం ఘనం.
• కోట్లమంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు.
• రైతులు వారి హక్కుల కోసం దేశరాజధాని ఢిల్లీలో 13 నెలల పాటు ఆందోళన చేపట్టాల్సిన దుస్థితి. భారతదేశంలో తప్ప వేరే ఏ దేశంలోనైనా ఇలా జరుగుతుందా ? 13 నెలల పాటు రైతుల ఆందోళన సాగడం సిగ్గు పడాల్సిన విషయం.
• అంత సుదీర్ఘ కాలం రైతుల ఆందోళన చేపట్టిన ఫలితం శూన్యం. కేంద్రం నుంచి సమాధానమే రాలేదు. ఒక్క సమస్యకు పరిష్కారం లభించలేదు. నేటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క భరోసా కూడా లభించలేదు.
• దేశ ప్రజలు, రైతులు, పేదలను ఇలా హేళన చేయడం భావ్యమేనా ?
• అందుకే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని బిఆర్ఎస్ పార్టీ ఎత్తుకున్నది
• ఈ దేశ రైతులు నాగలి తో పాటు కలం కూడా పట్టడం నేర్చుకోవాలి
• ఈ దేశ రైతులు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. చట్టసభల్లోకి పోవాలి
• ఒకనాడు తెలంగాణలో కూడా సాగు, తాగునీటి కోసం, విద్యుత్ కోసం పరితపించినం.
• నేటి స్వరాష్ట్రంలో ఇంటింటికీ నల్లా, ప్రతీ పంట పొలానికి సాగునీరు, విద్యుత్ ను అందించుకుంటూ ప్రగతి పథంలో ముందుకు పోతున్నాం
• బంజారా తండాలో గరీబుకు, బంజారాహిల్స్ లోని అమీరుకు ఒకే రకమైన శుద్ధి చేసిన నీళ్ళు అందిస్తున్నాం.
• తెలంగాణలో ఇది సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు కాదు ? ఒరిస్సాలో ఎందుకు కాదు ?
• ఇది ధన్ కి బాత్ కాదు… మన్ కీ బాత్ (ఇది ధనం లేకపోవడం సమస్య కాదు… మనస్సు పెట్టకపోవడం వల్ల ఏర్పడే సమస్య)
• దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తేవడానికి బలమైన పొలిటికల్ కమిట్ మెంట్ ఉండాలి. అది మా దగ్గర ఉంది.
• తెలంగాణలో వ్యవసాయం బాగుపడింది. రైతు ఆత్మహత్యలు లేవు. రైతుల సంక్షేమం వర్ధిల్లుతున్నది.
• ఇప్పుడు దేశంలో కేంద్ర ప్రభుత్వం సోషలైజేషన్ ఆఫ్ ది లాసెస్ – ప్రైవేటైజేషన్ ఆఫ్ ది ప్రాఫిట్ అనే విధానాన్ని అనుసరిస్తున్నది
• గిరిధర్ గమాంగ్ గారు మాజీ సీఎం. చాలా గొప్ప సీనియర్ నాయకుడు. మచ్చలేని నాయకుడు. వారు ఈ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది.
• ఒడిషా నుంచి మీరందరూ రావడం నాకు వేయి ఏనుగుల బలాన్ని ఇస్తున్నది.
(మా ఒడిషాలో 500 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు… తెలంగాణలో 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న విషయాన్ని చెప్పమని సీఎం కేసీఆర్ ను ఒడిషా నాయకుడు కోరగా చప్పట్లు మారుమోగాయి)
• బిఆర్ఎస్ కు అధికారం ఇస్తే రెండేండ్లలో దేశమంతటికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తాం. వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్ ఇస్తాం. దేశంలోని రైతులకు కిసాన్ బంధు, ఏటా 20 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధును అమలు చేస్తాం.
• శుద్ధి చేసిన నీరును తెలంగాణ మాదిరే దేశవ్యాప్తంగా అందిస్తాం.
• దేశంలోని 83 కోట్ల ఎకరాల వ్యవసాయయోగ్యమైన భూమిని సాధ్యమైనంత ఎక్కువగా సాగులోకి తెస్తాం.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఒడిశా నాయకుల వివరాలు:

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, మాజీ ఎంపీ హేమా గమాంగ్, శిశిర్ గమాంగ్, శౌర్య గమాంగ్, ఒడిశా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ప్రధాన కార్యదర్శి స్నేహరంజన్ దాస్, కొరాపుట్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువత అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యులు రబింద్ర మొహపాత్రా, ఫల్గుణి సబర్, పి.గోపాల్ రావు, మల్యా రంజన్ స్వెయిన్, నవనిర్మాణ్ కిశాన్ సంఘటన్ కన్వీనర్ అక్షయ్ కుమార్, మయూర్ భంజ్ మాజీ ఎంపీ, ఎమ్మెల్యే రాంచంద్ర హన్సడా, ధైన్ కనాల్ మాజీ ఎమ్మెల్యే నబిన్ నందా, బండారి పొఖ్రి, భద్రక్ మాజీ ఎమ్మెల్యే, బిజెడి యువత మాజీ అధ్యక్షుడు రతా దాస్, బింజార్పూర్, జాజ్పూర్ మాజీ ఎమ్మెల్యే అర్జున్ దాస్, బలిపట్నా, ఖర్దా మాజీ ఎమ్మెల్యే రాఘవ్ శెట్టి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే బ్రుందావన్ మాఝీ, బిజెడి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దేవాశిష్ నాయక్, జనతాదళ్ సోన్ పూర్ మాజీ ఎమ్మెల్యే దేవ్ రాజ్ శెతి, బిజెడి, బిజెపి మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశన్న్ పడి, ఒడిశా పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి (జన్ మోర్చా) కైలాష్ కుమార్ ముఖి, ఒడిషా ఆర్టీఐ ఆక్టివిస్ట్ ఫోరం అధ్యక్షుడు ప్రదీప్ ప్రధాన్, నవనిర్మాణ్ క్రుషక్ సంఘటన్ రాష్ట్ర కన్వీనర్, బిజెడి రాష్ట్రయువత సెక్రటరీ సేశ్ దేవ్ నందా, ఎన్ కెఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉమాకాంత్ భరత్, ఎన్ కెఎస్ రాష్ట్ర కో కన్వీనర్ నిమయి రాయ్, ఒడిశా హైకోర్ట్ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అడ్వకేట్ ఖిరొట్ రౌత్, కెంజొర్ నాయకుడు బిష్ణు ప్రియా నాయక్,

ఝర్సుగూడ ట్రేడ్ యూనియన్ లీడర్ రఖ్యాకర్ అనుపమ్, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన రంజీత్ పట్నాయక్, జగ్ బంధు మొహతా, ఒడిశా బార్ కౌన్సిల్ సభ్యులు అడ్వకేట్ సూర్య పడి, జిల్లా పరిషత్ మాజీ నేత కాశినాథ్ బెహ్రా, బిజెడి ఎస్సీ & ఎస్టీ అధ్యక్షుడు కైలాష్ చంద్ర నాయక్, ఎన్ వైసిఎస్ రాష్ట్ర యువత కన్వీనర్ ఎం.డి. మన్వర్ అలీ, ఎన్ వైసిఎస్ కో కన్వీనర్ అమిత్ కుమార్ జెనా, సమాజ్ న్యూస్ పేపర్ సీనియర్ జర్నలిస్ట్. సామాజిక కార్యకర్త ప్రమోద్ కుమార్ సామంత్ రాయ్, మాజీ ఎంపీ జయ్ రాం పంగి, నాయకులు రాజేష్ పుత్రా, బలిగూడ బిజెపి మండల్ సభాపతి జనార్ధన్ మొహంతి, నాయకులు దినేష్ నాయర్, సుధీర్ సదంగి, బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు సమానత్ ఖొరా, పొతంగి నాయకుడు ప్రతాప్ చౌదరీ, మల్కాన్ గిరి ప్రజా జిల్లా అధ్యక్షుడు ఘెను ముదాలి, మల్కాన్ గిరి డిపిబిపి మాజీ కార్యదర్శి హరీష్ చంద్ర గాలరీ, బలిగూడ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జుఢుస్టిర్ నాయక్, కొరాపుట్ స్మిలిగుట బ్లాక్ మాజీ చైర్మన్ నారాయణ్ రావు, మల్కాన్ గిరి గషాటి జిల్లా జర్నలిస్ట్ రాంచంద్రన్ మడ్కాని, జర్నలిస్ట్ గొబిందా మొండల్, డిపిబిపి కలిమెల బ్లాక్ సభ్యులు నిఖిల్ హంతాల్, నాయకులు బేణు హంతాల్, నాయకులు అమల్ మండల్, దిదాయ్ సమాజ్ మల్కాన్ గిరి జిల్లా అధ్యక్షుడు సమర్ సిస, కంధ సమాజ్ మల్కాన్ గిరి జిల్లా అధ్యక్షుడు గోపి పంగి, డిపిబిపి మల్కాన్ గిరి జిల్లా ఉపాధ్యక్షుడు టిల్లీ పంగి, జేపీ అడ్వకేట్ సుధీర్ సదాంగి, ఆర్ పిటి జెపి నాయకులు రాజేంద్ర గౌడ, బిపూర్ నాయకులు సుజయ కు ఆచార్య, ఎస్ గూడ నాయకులు మాజీ చైర్మన్ ఎస్.నారాయణ రావు, బిజెపి జిల్లా కార్యదర్శి గదాధర్ బారిక్, ఎస్ గూడ నాయకులు అర్జున్ పంగి, ఎస్ గూడ నాయకులు బనామలి ఖిల్లొ, రాయగర్ తెలుగు నాయకులు శ్రీరాం మూర్తి తదితరులు.

Also Read : BRS కు తమిళనాడు నాడార్ సంఘాల మద్దతు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *