Wednesday, March 12, 2025
HomeTrending Newsఆదివారం బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఆదివారం బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఎన్నికల ఏడాది కావటంతో అన్ని పార్టీలు ప్రాచారస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ – కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో డీ అంటే డీ అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అమీ తుమి తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. పార్లమెంటు వేదికగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో  ఎల్లుండి (29న) మధ్యాహ్నం 1 గంటకు సిఎం కెసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం తెలంగాణ భవన్ లో సమావేశం ప్రారంభమవుతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంటులో చర్చించ బోయే అంశాలపై, అనుసరించ వలసిన వ్యూహంపై, అధినేత, సిఎం కెసిఆర్ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్