Saturday, June 13, 2026
Homeసినిమాచరణ్‌, మైత్రీ మధ్య ఏమైంది..?

చరణ్‌, మైత్రీ మధ్య ఏమైంది..?

రామ్ చరణ్‌, శంకర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అని గత కొన్ని రోజులుగా సమాధానం లేని ప్రశ్నగా ఉండేది. ఇప్పుడు సమాధానం దొరికింది. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన బుచ్చిబాబుతో సినిమా చేయడానికి రామ్ చరణ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్టీఆర్ తో సినిమా చేయాలని బుచ్చిబాబు చాలా రోజులుగా ప్రయత్నించాడు కానీ కుదరలేదు. ఆఖరికి చరణ్ తో మూవీ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు బుచ్చిబాబు.

అయితే.. చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొందే చిత్రాన్ని నిర్మించేది మైత్రీ మూవీ మేకర్స్ కాదు. అదే సంస్థలో మైనర్ భాగస్వామి అయిన సతీష్ కిలారు ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్ గా మారుతున్నారు. ఆయన ఈ మూవీని నిర్మిస్తున్నారు. బుచ్చిబాబు డైరక్ట్ కాబట్టి,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వుంటుంది కానీ.. నిర్మాత సతీష్ కిలారునే. ఇక్కడే రకరకాల గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ కు మైత్రీకి మధ్యలో ఏం జ‌రిగింది? అందుకనే ఈ సినిమాను మైత్రీ బ్యానర్ లో చేయకుండా కొత్త బ్యానర్ లో సతీష్ కిలారుకు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

అసలు ‘వాల్తేరు వీరయ్య’ టైమ్ లోనే మెగాస్టార్ కు మైత్రీకి మధ్యలో ఏమైనా జ‌రిగిందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే… మైత్రీ దగ్గర వున్న దర్శకుడు..మైత్రీ తీసుకెళ్లిన కథ అన్నది వాస్తవం కానీ.. మైత్రీకి కాకుండా వేరే వాళ్లకు చేస్తా అని హీరో అన్నారు అని వార్తలు వినిపించడం, అలాగే వేరే బ్యానర్ ఫిక్స్ కావడం అన్నది ఈ అనుమానాలకు తావిస్తోంది. మొత్తానికి ఏదో జరిగింది. ఏదైతేనే.. ‘ఉప్పెన’ మూవీ తర్వాత నుంచి రెండు సంవత్సరాలు ఎదురు చూసిన బుచ్చిబాబుకు ఇన్నాళ్లకు నెక్ట్స్ మూవీ సెట్ అయ్యింది. అది కూడా చరణ్‌ తో. మరి.. ఈ సినిమాతో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular