Sunday, January 19, 2025
Homeసినిమా‘రామారావు…’ నుంచి ‘బుల్ బుల్ తరంగ్’

‘రామారావు…’ నుంచి ‘బుల్ బుల్ తరంగ్’

Bul Bul: మాస్ మ‌హారాజా రవితేజ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీతో శరత్ మండవ ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్, ఆర్టీ టీమ్ వ‌ర్క్స్  బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ర‌వితేజ స‌ర‌స‌న దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ న‌టిస్తున్నారు. సీనియ‌ర్ హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీఎంట్రి ఇస్తుండ‌డం విశేషం.

ఈ భారీ చిత్రాన్ని జూన్ 17వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. య‌దార్థ సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. ‘బుల్ బుల్ త‌రంగ్’.. అంటూ సాగే ఈ పాట‌ను ఈ నెల 10న రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అంతే కాకుండా ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ లో రవితేజ, రజిషా ఇద్ద‌రూ అందంగా క‌నిపిస్తున్నారు. స్పెయిన్ లో ఈ పాట‌ను చిత్రీక‌రించారు.

Also Read : ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్