Monday, June 17, 2024
Homeసినిమా'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్

‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

ROD in June: మాస్ మ‌హారాజా రవితేజ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాతో శరత్ మండవ ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు మేక‌ర్స్. జూన్ 17వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలియ‌చేస్తూ.. అందుకు సంబంధించిన అఫిషియ‌ల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఏప్రిల్, మే నెలలో భారీ సినిమాలు ఉండటమే అందుకు కారణం కావొచ్చు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు. సీనియర్  హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, నరేష్‌, పవిత్ర లోకేశ్ కనిపించనున్నారు. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ ఖిలాడి చిత్రం నిరాశ ప‌రిచింది. మ‌రి.. రామారావు ఆన్ డ్యూటీ ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి

Also Read : రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీజర్ లాంచ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్