Sunday, May 26, 2024
Homeస్పోర్ట్స్స్విస్ ఓపెన్: తొలి రౌండ్ లో ఇండియా ముందంజ

స్విస్ ఓపెన్: తొలి రౌండ్ లో ఇండియా ముందంజ

Swiss Open-2022: స్విస్ ఓపెన్ 2022 టోర్నీలో తొలిరోజు ఇండియాకు మంచి ఫలితాలు లభించాయి. మహిళల సింగిల్స్ లో పివి సింధు, సైనా నెహ్వాల్, అస్మితలు రెండో రౌండ్ కు చేరుకోగా, పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్, ప్రన్నోయ్, కాశ్యప్ తమ ప్రత్యర్థులపై విజయకేతనం ఎగురవేశారు.

మహిళల సింగల్స్ లో
పివి సింధు 21-14; 21-12తో డెన్మార్క్ కు చెందిన లైన్ హోజ్మార్క్ ను ఓడించింది
అస్మిత చలీహా 19-21; 21-10; 21-11తో ఫ్రాన్స్ క్రీడాకారిణి హుయెట్ పై విజయం సాధించింది
సైనా నెహ్వాల్ 21-8; 21-13 తో ఫ్రాన్స్ క్రీడాకారిణి హోయాక్స్పై విజయం సాధించింది
జర్మనీ క్రీడాకారిణి యొన్నే లీ 21-5; 21-17తో ఆకర్షి కాశ్యప్ పై విజయం సాధించింది
ఫ్రాన్స్ క్రీడాకారిణి కీ జుఫీ చేతిలో 21-16; 21-17తో మాళవిక మన్సూద్ ఓటమి పాలైంది

పురుషుల సింగల్స్ లో
పారుపల్లి కాశ్యప్ 21-17; 21-9తో ఫ్రాన్స్ కు చెందిన ఎనోగాట్ రాయ్ పై విజయం సాధించాడు
హెచ్ ఎస్ ప్రన్నోయ్ మనదేశానికే చెందిన సాయి ప్రణీత్ పై25-23; 21-16 తో విజయం సాధించాడు
సమీర్ వర్మ 18-21; 21-15; 21-11తో ఫ్రాన్స్ కు చెందిన లుకాస్  క్లియర్ బాట్ పై విజయం సాధించాడు.
కిడాంబి శ్రీకాంత్ 21-16;21-17తో ఫ్రాన్స్ కు చెందిన మాడ్స్ క్రిస్టో ఫియర్సన్ పై విజయం సాధించాడు

మహిళల డబుల్స్ లో..
థాయ్ లాండ్ జోడీ జాంగ్ కోల్ఫన్ – రవిండా చేతిలో 21-10; 21-17తో  త్రీసా జాలీ – గాయత్రి గోపీచంద్ ఓడిపోయారు
అశ్విని పొన్నప్ప – సిక్కీ రెడ్డి జోడీ 21-15; 21-16తో స్విట్జర్లాండ్ జంట ఆలిన్ ముల్లర్ – జెంజిరపై విజయం సాధించింది.

పురుషుల డబుల్స్ లో..
ఇంగ్లాండ్ జోడీ బెన్ లేన్- సీన్ వెండీ ద్వయం 21-14, 21-17తో వసంత కుమార్ హనుమయ్య- అషిత్ సూర్య పై గెలుపొందారు.
సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ 17-21; 21-11; 21-18 తో ఇండోనేషియా జోడీ ముహమ్మద్ షోబుల్- బగాస్ మౌలానా పై గెలుపొందారు
ఇండోనేషియా జోడీ ఫజర్ అల్ఫియన్- ముహమ్మద్ రియాన్ జోడీ 21-19; 21-13తో ఎమ్మార్ అర్జున్ – ధృవ్ కపిల జంటపై విజయం సాధించింది.
ఇషాన్ భట్నాగర్ – సాయి ప్రతీక్ ద్వయం 28-30; 21-14; 21-18తో ఇంగ్లాండ్ ద్వయం రోరీ ఈస్టన్-జాక్ రస్ పై విజయం సాధించారు.

మిక్స్డ్ డబుల్స్ లో
సునీత్ రెడ్డి- అశ్విని పొన్నప్ప జోడీపై 21-13;21-9 తేడాతో ఫ్రెంచ్ జోడీ థామ్- డెల్ఫిన్ గెలుపొందారు.

Also Read : మహిళల వరల్డ్ కప్: బంగ్లాపై భారత్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్