Monday, June 17, 2024
Homeస్పోర్ట్స్IPL: హైదరాబాద్ ను చిత్తు చేసిన కోల్ కతా

IPL: హైదరాబాద్ ను చిత్తు చేసిన కోల్ కతా

కీలక మ్యాచ్ లో పేలవవమైన ప్రదర్శనతో  సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ లో భాగంగా నేడు జరిగిన క్వాలిఫైయర్-1 లో కోల్ కతా  నైట్ రైడర్స్ చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. చివర్లో కెప్టెన్ కమ్మిన్స్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి 30 పరుగులు చేయడంతో ఈ మాత్రం స్కోరు నైనా సాధించగలిగింది. జట్టులో రాహుల్ త్రిపాఠి 55 (35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్); క్లాసేన్ 32 పరుగులు చేశారు. ఈ ముగ్గురు మినహా మిగిలినవారు ఘోరంగా విఫలమయ్యారు.

ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ అయి వరుసగా రెండో మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ ప్రదర్శిస్తోన్న అభిషేక్ శర్మ సైతం అనవసర షాట్ కు ప్రయత్నించి కేవలం 3 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. అబ్దుల్ సమద్ 16; నితీష్ కుమార్ 9; విజయ్ కాంత్ 7 పరుగులు చేయగా, సన్వీర్ సింగ్,  భువేనేశ్వర్ కుమార్ లు డకౌట్ అయ్యారు.

కోల్ కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3; వరుణ్ చక్రవర్తి 2; వైభవ అరోరా, హర్షిత్ రానా, సునీల్ నరైన్ ఆండ్రీ రసెల్ ఒక వికెట్ పడగొట్టారు.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు గుర్జాబ్ (23); సునీల్ నరైన్ (21) పరుగులు చేసి ఔట్ కాగా, వెంకటేష్ అయ్యర్-51 (28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు); శ్రేయాస్ అయ్యర్-58 (24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 13.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అద్భుత విజయం అందుకుంది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, కమ్మిన్స్ చెరో వికెట్ పడగొట్టారు.

మిచెల్ స్టార్క్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

నేడు బెంగుళూరు- రాజస్థాన్ మధ్య జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో విజేతతో హైదరాబాద్ క్వాలిఫైర్-2 మ్యాచ్ ఆడనుంది. నిన్నటి మ్యాచ్ లో దారుణ పరాజయాన్ని దిగమింగుకొని శుక్రవారం జరిగే ఈ మ్యాచ్ కు సన్నద్ధం కావాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్